Site icon NTV Telugu

Viral video: స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి భూకంపం.. ప్రభావాలు చూసారా..?

12

12

మార్చి 5 శుక్రవారం నాడు అమెరికాలోని న్యూయార్క్ నగరంలో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఫిలడెల్ఫియా నుండి న్యూయార్క్, అలాగే అమెరికా తూర్పున ఉన్న లాంగ్ ఐలాండ్ వరకు శుక్రవారం ఉదయం వేళ భూకంపం సంబంధించింది. రిక్టర్ స్కేల్ పై 4.8 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం దాటికి అనేక ఇల్లు, భవనాలు కట్టడాలు కంపించాయి. ఇందులో భాగంగానే ప్రపంచ వింతలలో ఒకటైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కి సైతం భూకంప ప్రభావం పడింది.

Also Read: Pakistan: “అక్కడికి వెళ్లి ఉగ్రవాదుల్ని హతమారుస్తాం”.. రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలపై స్పందించిన పాకిస్తాన్..

న్యూయార్క్ నగరానికి పశ్చిమాన భూకంప కేంద్రాన్ని 4.7 కిలోమీటర్ల లోతులో న్యూజెర్సీలోని టెక్స్ బరిలో అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి అనేక విషయాలను యునైటెడ్ స్టేట్స్ జిలాజికల్ సర్వే తెలిపింది. ఇకపోతే తాజాగా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం వద్ద సంభవించిన భూకంప దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇం దుకు సంబంధించి వివరాలకు వెళితే.. అమెరికా లో సంభవించిన భూకంపనకు ఎలాంటి ఆస్తి, ప్రాణం నష్టాలు సంభవించలేదని న్యూయార్క్ నగర అత్యవసర సేవలు విభాగం తెలిపింది.

Also Read: Tirumala Darshan: వెంకన్న స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. మూడు నెలలు వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు..!

కనెక్టిక్ట్, బ్రూక్లిన్ ఇలా అనేక చోట్ల ప్రజలు భూకంపం తీవ్రతను గుర్తించారు. భూకంప సమయంలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కల్పించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భూకంపం దెబ్బకి లిబర్టీ విగ్రహం కదులుతున్న వీడియో చూస్తుంటే భూకంప తీవ్రత ఎలా ఉంటుందో సులువుగా అర్థమవుతుంది. ఇందుకు సంబంధించి లిబర్టీ స్టాచ్ లో ఉన్న సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఈ భూకంపంపై అమెరికా దేశా అధ్యక్షుడు స్పందించారు. ఆయన న్యూయార్క్ గవర్నర్ తో మాట్లాడానని వారికి అవసరమైన సహాయాన్ని తక్షణమే తాను అందించడానికి రెడీగా ఉన్నట్లు తెలిపారు.

Exit mobile version