Snake Climbed on a Sleeping Man: పాములను చూస్తే ఎవరికైనా భయమే వేస్తుంది. కానీ ఒంటి మీద పాకుతుంటే ఎమౌతుంది.. ఒళ్లు జలదరిస్తుంది కదా?. అలాంటి ఘటనే మధ్య ప్రదేశ్‌లో జరిగింది. పడుకున్న యువకుడి శరీరంపైకి పాము ఎగబాకింది. శరీరంపై ఎదో పాకుతున్నట్లు అనిపించి అతడు కళ్లు తెరిచాడు. మీద పాము ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే పామును తలను గట్టిగా నొక్కిపట్టాడు. భయంతో ఏడ్చుకుంటూ ఆస్పత్రికి పరుగులు తీశాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్‌లోని తిస్‌గానా గ్రామానికి చెందిన గోవింద అనే యువకుడు ఇంట్లో నిద్రపోతూ ఉన్నాడు. ఓ పాము అతడిపైకి పాకింది. దీంతో అతడికి మెలుకువ వచ్చింది. శరీరంపై పాము ఉండటం చూసి గోవింద షాక్ అయ్యాడు. వెంటనే పాము తలను చేత్తో పట్టుకుని గట్టిగా అరిచేశాడు. దీంతో వారి కుటుంబ సభ్యులంతా ఆతడి వద్దకు వచ్చారు. అనంతరం అతడిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
Also Read: Delhi Metro Fare Hike: పెరిగిన మెట్రో ఛార్జీలు.. 8 సంవత్సరాల తర్వాత..!
తనను పాము కరిచిందని డాక్టర్ ముందు గోవింద ఏడ్చాడు. గోవిందను పరిక్షీంచిన డాక్టర్.. పాము కరవలేదని చెప్పాడు. దాంతో గోవింద సాగా అతడి కుటుంబసభ్యులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం గోవింద ఆ పామును దూరంగా వదిలిపెట్టాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ పాము అప్పటికే ప్రాణాలు వదిలేసింది. గోవింద పాము తలను చేత్తో 30 నిమిషాల పాటు గట్టిగా పట్టుకోవడంతో అది చనిపోయింది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన అందరూ గోవింద ధైర్యసాహసాలను మెచ్చుకుంటున్నారు.
