Site icon NTV Telugu

Deer Eat Snake: పామును గడ్డిలా బరా బరా నమిలి తిన్న జింక

Deer

Deer

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తరచుగా అద్భుతమైన వన్యప్రాణుల వీడియోలతో తన ఫాలోవర్స్ ను అలరిస్తుంటాడు. తాజాగా, జింక పామును తిన్న మరో అద్భుతమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. జింకలను శాకాహారులుగా పరిగణిస్తారు. కానీ.. ఇవి ప్రధానంగా ఆకులు, అలములు, గడ్డిలాంటివాటిని ఆహారంగా తీసుకుంటాయి. అయితే, ఓ జింక పామును తినే ఈ అరుదైన దృశ్యాన్ని కారులో వెళ్తున్న ఓ వ్యక్తి చూసి దాన్ని వీడియో తీశాడు.

Also Read : Project k: ప్రభాస్ ప్రాజెక్ట్ కె సినిమా విడుదల వాయిదా పడబోతుందా..?

అటవీ ప్రాంతంలో ఒక జింక రోడ్డు పక్కన నిలబడి పామును నమలడం ఈ వీడియోలో కనిపిస్తుంది. వీడియో రికార్డింగ్ చేస్తున్న వ్యక్తి బ్యాక్‌గ్రౌండ్‌లో జింక పామును తింటుందా? అనే అనుమానం మనకు కలుగుతుంది. నేషనల్ జియోగ్రాఫిక్ తెలిపిన వివరాల ప్రకారం.. జింకలు ఫాస్ఫరస్, ఉప్పు, కాల్షియం వంటి ఖనిజాల కోసం.. ప్రత్యేకించి శీతాకాలంలో మొక్కల జీవం తక్కువగా ఉన్నప్పుడు మాంసాన్ని జింకలు తింటాయని వెల్లడించింది.

Also Read : Astrology : జూన్‌, మంగళవారం దినఫలాలు

శాకాహార జంతువులు కొన్ని సమయాల్లో పాములను తింటాయి.. అంటూ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ క్యాప్షన్ రాశారు. ఈ వీడియోను సైన్స్ గర్ల్ అనే పేజీ కూడా షేర్ చేసింది. దీనిమీద నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. పోస్ట్ చేసినప్పటి నుండి, ఈ వీడియోకు ట్విట్టర్‌లో లక్ష కంటే ఎక్కువవ్యూస్ వచ్చాయి. అనేక కామెంట్లు కూడా ఉన్నాయి. అయితే జింక పామును తింటున్న వీడియో మాత్రం నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.

Exit mobile version