NTV Telugu Site icon

Viral Video: ఇంజన్ లేకుండానే పరుగులు పెట్టిన రైలు.. ఎలాగంటే..!

Video

Video

అప్పుడప్పుడు వాహనాలు ట్రబుల్ ఇచ్చినప్పుడు కొంత మంది తోయడం వంటి సీన్లు చూస్తుంటాం. కానీ ట్రైన్‌ను అలా తోయడం ఎప్పుడైనా చూశారా? తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో కొంత మంది రైల్వే కార్మికులు, ప్రయాణికులు రైలు బండిని తోయడంతో వేగంగా ముందుకు కదిలింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అసలు ఇంతకీ ఏమైంది? ట్రైన్‌ను తోయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది. అయితే ఈ వార్త చదవండి.

ఇది కూడా చదవండి: Annamalai: మోడీ కేబినెట్‌లోకి అన్నామలై..?

బీహార్‌లోని కియుల్ రైల్వే స్టేషన్‌లో మెమో రైలు ఆగి ఉంది. అందులో ఒక రైలు కోచ్ నుంచి సడన్‌గా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ప్రయాణికులు కిందకి దిగేసి ప్రమాదం నుంచి తప్పుకున్నారు. అంతటితో ఆగకుండా మంటలు అంటున్న బోగీ నుంచి ఇతర బోగీలకు కూడా మంటలు వ్యాపించకుండా వెంటనే ప్రయాణికులు బోగీలను వేరు చేసేందుకు ప్రయత్నం చేశారు. బోగీలను తోయగా రైలు వెనక్కి వెళ్లిపోయింది. దీంతో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. లఖిసరాయ్ జిల్లాలోని కియుల్ జంక్షన్ స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇది కూడా చదవండి:War 2 : హృతిక్ రోషన్ ‘వార్ 2’ లో ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్..?

రైల్వే అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం.. పాట్నాలోని మహిళా కంపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగినట్లు తెలిపారు. గురువారం ప్యాసింజర్ రైలులో ఈ మంటలు అంటుకున్నాయని చెప్పారు. మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఇతర బోగీలను దూరంగా నెట్టారని చెప్పుకొచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రైల్వే అధికారులు సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితుల్ని సమీక్షించారు.