Viral video: విమానంలో విండో సీటు కోసం దారుణంగా కొట్టుకున్న ప్రయాణికులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొంతకాలంగా విమనాల్లో కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి.. దీంతో జనాలు విమానాల్లో ప్రయానించాలంటే వణికిపోతున్నారు..ఇప్పటి వరకు సాధారణ బస్సులు లేదా రైళ్ల జనరల్ కోచ్‌లలో ప్రయాణికులు కొట్టుకోవడం,గొడవపడటం చూశాం. అయితే విమానంలో కిటికీ కోసం ప్రయాణికులు గొడవపడడం ఎప్పుడైనా చూశారా? తాజాగా మాల్టా నుంచి లండన్ వెళ్తున్న ర్యాన్ ఎయిర్ విమానంలో ప్రయాణికులకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.. కిటికీ సీటు కోసం ఇద్దరు ప్రయాణీకులు దారుణంగా కొట్టుకున్నారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది..
ర్యాన్ ఎయిర్ విమానం మాల్టా నుంచి లండన్ వైపు వెళ్తుంది.. ప్రయాణికులు విమానంలోకి చేరుకుంటున్నారు. విమానంలో నడవ సీటు ఉన్న ప్రయాణీకుడు ముందుగా వచ్చి తన సీటులో కూర్చున్నాడు. అయితే అతడి పక్కన ఉన్న విండో సీటు సీటులో కూర్చునేందుకు ఓ ప్రయాణికుడు ప్రయత్నించాడు. అయితే నడవ సీటులో కూర్చున్న వ్యక్తి విండో సీటు ప్రయాణికుడిని కిటికీ వైపుకి వెళ్లడానికి అనుమతించలేదని చెబుతున్నారు. దీని గురించే ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ మొదలైంది. కొద్దిసేపటికే ఈ సీటింగ్ ఏర్పాటుపై వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుంది. ముందుగా కొంత మంది ప్రయాణికులు వారిద్దరినీ శాంతింపజేసేందుకు ముందుకు వచ్చారు. వీళ్ళ గొడవ తగ్గక పోవడంతో సిబ్బంది కూడా వచ్చి సర్ది చెప్పారు..
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. 'బేబీ బాస్'ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
- Passport Row: పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
- Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
- Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
ఈ గొడవలో ఇద్దరూ ఒకరినొకరు చాలా దూషించుకుంటూ కొట్టుకున్నారు. నోటికి వచ్చిన బూతులతో తిట్టుకున్నారు.. విమానంలో గొడవ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. ఇక అక్కడ కూడా వదలరా అంటూ ఓ రేంజులో కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాలకే వైరల్ గా మారుతుంది..అయితే ఇటీవల విమాన ఆలస్యంపై ఓ ప్రయాణికుడు ర్యాన్ఎయిర్ కంపెనీపై కేసు పెట్టాడు. ఈ కేసులో ప్రయాణికుడు గెలిచాడు. ఇప్పుడు ఇలా జరగడం పై జనాలు ఆ సంస్థ విమానాల పై ఆసక్తి చూపించడం లేదని సమాచారం..
తాజావార్తలు
-
Pradeep Ranganathan: ఆ డైరెక్టర్’తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. ‘బేబీ బాస్’ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
-
Passport Row: పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
-
Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
-
Rao Bahadur: “మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!” రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!