Site icon NTV Telugu

Shehrbano Naqvi: పాకిస్తాన్‌లో ‘సూపర్ ఉమెన్’ మహిళా పోలీసు అధికారి.. గంటలోనే హత్య మిస్టరీ ఛేదన..!

Shehrbano Naqvi

Shehrbano Naqvi

Shehrbano Naqvi: బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించడం ప్రశంసనీయం. కానీ అదే పని అతిగా నాటకీయంగా మారితే నవ్వుల పాలు కావాల్సిందే మరి. ఈ పరిస్థితిని ప్రస్తుతం పాకిస్థాన్‌కు చెందిన మహిళా పోలీస్ అధికారి ఏఎస్పీ షెహర్‌బానో నఖ్వీ స్వయంగా ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ధైర్యానికి ప్రతీకగా నిలిచిన ఆమె, ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్‌కు గురవుతున్నారు.

Dandora OTT: ‘దండోరా’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

లాహోర్‌కు చెందిన అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయిన షెహర్‌బానో నఖ్వీ ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూ సమయంలో జరిగిన సంఘటన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. పాడ్‌కాస్ట్ నడుస్తుండగానే ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్‌లో మాట్లాడుతూ.. “ఏంటి ఖుర్రమ్… నిందితుడు దొరికిపోయాడా? చాలా బాగుంది.. నేను ఇప్పుడే వస్తున్నా” అని చెప్పి కాల్ కట్ చేశారు. ఆ వెంటనే పాడ్‌కాస్టర్‌కు “ఒక మర్డర్ జరిగింది, వెంటనే అక్కడికి వెళ్లాలి” అని చెప్పి ఆమె ఇంటర్వ్యూ మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు.

ఇక్కడే అసలు ట్విస్ట్. కేవలం ఒక గంటలోపే తిరిగి పాడ్‌కాస్ట్‌కు వచ్చిన నఖ్వీ.. మర్డర్ కేసు పూర్తి వివరాలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. డిఫెన్స్ ఫేజ్-A, K బ్లాక్‌లో జరిగిన హత్య అని, డబ్బుల విషయంలో ఓ వ్యక్తి తన స్నేహితుడినే హత్య చేశాడని, నిందితుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని, అతడి వద్ద బందీగా ఉన్న వ్యక్తులను కూడా విడిపించామని వివరించారు. మృతదేహం డ్రాయింగ్ రూమ్‌లో లభించిందని కూడా చెప్పారు.

Viral Video: ఘోర రోడ్డు ప్రమాదం.. లోడ్ లారీ బోల్తా, బొలెరో నుజ్జునుజ్జు..!

అయితే ఈ మొత్తం వ్యవహారం నెటిజన్లకు సినిమాటిక్ సీన్‌లా అనిపించింది. ఒక గంటలో మర్డర్ కేసు సమాచారం, స్పాట్‌కు వెళ్లడం, నిందితుడిని పట్టుకోవడం, కేసు సాల్వ్ చేయడం… మళ్లీ పాడ్‌కాస్ట్‌కు రావడం ఏంటి? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిసింది. ముఖ్యంగా పాకిస్థానీ నెటిజన్లు ఆమెపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ స్క్రిప్ట్ ఎవరు రాశారో కానీ, యాక్టింగ్ మాత్రం అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే.. “నెట్‌ఫ్లిక్స్ సిరీస్ కూడా ఇంత వేగంగా అయిపోదు” అని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు దీనిని కేవలం పబ్లిసిటీ స్టంట్‌ అంటూ కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version