ఈ మధ్యకాలంలో చాలామంది ప్రతీది కాస్త వెరైటీగా ఉండాలని ఆలోచన చేస్తూ అటువైపు అడుగులు వేస్తున్నారు. చేసే పని ఏదైనా సరే.. కాస్త వెరైటీగా ఉండాలంటూ కొత్త కొత్త ఆలోచనలతో దూసుకెళ్తున్నారు. చేసేది పుట్టినరోజు వేడుకైనా, లేకపోతే వివాహ వేడుకైన కార్యక్రమం ఏదైనా సరే వారి ఇంటితో పాటు వారి పరిసరాలు కూడా చక్కగా అలంకరించుకుంటూ అందరికీ కొత్త ఓరవడులను సృష్టిస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. మన వాహనాలను ఏదైనా రేడియం లేదా పెయింటింగ్ లతో డిజైన్ చేస్తూ ఉండడం కామన్. కాకపోతే ప్రస్తుతం స్కూటీకి చెందిన ప్రత్యేక ఆకర్షణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో గుజరాత్ లో చిత్రీకరించిందిగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also read: K. Laxman: టాం అండ్ జెర్రీ ఫైట్ లా ఉంది కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యవహారం..!
గుజరాత్ కు చెందిన హేతల్ అనే మహిళ తన బైకు చాలా ప్రత్యేకంగా అలంకరించుకుంది. బాగా వైరల్ అవుతున్న వీడియోలో భాగంగా ఓ మహిళ భర్త కోసం ఓ బాక్స్ లో బైక్ ను ప్యాక్ చేసి బైక్ గిఫ్ట్ గా ఇస్తున్నట్లు కనబడుతుంది. దాంతో ఆవిడ భర్త వచ్చి బాక్స్ ను ఓపెన్ చేయగా అద్భుతంగా అలంకరించిన బైక్ కనబడుతుంది. అంత అందంగా అలంకరించిన బైక్ ను చూసిన అతను ఒకింత షాక్ అయ్యాడు. తన భార్య చేసిన డెకరేషన్ చూసి అతను నిజంగా ఆశ్చర్యపోయాడు. బండి తాళాల నుండి చక్రాల వరకు తన భార్య చేసిన డెకరేషన్ చూసి అతడు నిజంగా ఆశ్చర్యపోయాడు.
Also read: Aparna Das: ఇండస్ట్రీ హిట్ కొట్టిన హీరోతో హీరోయిన్ ప్రేమ పెళ్లి..!
ఇకపోతే ఆ బైక్ మొత్తాన్ని చంకీలు, పూసలు ఇలా అనేక రకాల డెకరేషన్ ఐటమ్స్ తో అలంకరించింది. వీడియోలో బైక్ ను ఎలా డెకరేట్ చేసిందో అన్న వివరాలను పూర్తిగా వీడియో రూపంలో తెలపండి. మహిళల దుస్తులకు ఉపయోగించే ఎంబ్రాయిడరీ వస్తువులు, పూసలు, స్టిక్ గమ్ములను ఒకటిగా ఉపయోగించుకుంటూ బైకును అందంగా తీర్చిదిద్దింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజంగా ఈ వీడియో చూసినవారు ఆ మహిళ నైపుణ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు.
