Site icon NTV Telugu

Viral Video: అంత ఆగలేకపోతున్నారా ఏంటి.. పబ్లిక్‌గా రొమాన్స్‌లో మునిగితేలిన యువత..!

Viral Video

Viral Video

Viral Video: ప్రస్తుత కాలంలో యువతలో, ముఖ్యంగా టీనేజ్‌ వయస్సులో ప్రేమ అనేది ఫ్యాషన్‌గా మారిపోయింది. స్కూల్ స్థాయిలోనే ప్రేమ వ్యవహారాలు మొదలవుతున్నాయి. బాయ్‌ఫ్రెండ్‌, గర్ల్‌ఫ్రెండ్‌ అంటూ పబ్లిక్ గా తిరుగుతున్నారు. కాలేజీల్లో అయితే ఈ ట్రెండ్ సర్వసాధారణంగా మారింది. అంతే కాదు, ఇటువంటి సంబంధాలు బహిరంగంగా ప్రదర్శించడమూ సాధారణమవుతోంది. ముఖ్యంగా బస్సుల్లో, రైళ్లలో, పార్కుల్లో యువత చేసే పనులు చూసి ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Asian Athletics Championships 2025: ముగిసిన ఎషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌-2024.. 24 పతకాలతో భారత్..!

తాజాగా ఓ ఆర్టీసీ బస్సులో స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న ఓ జంట బహిరంగంగా ముద్దులు పెట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో వారు బస్సు చివరి సీట్లలో కూర్చొని చుట్టూ ప్రయాణికులు ఉన్నా, కిటికీలు ఓపెన్‌గా ఉన్నా ఏమాత్రం ఆలోచించకుండా ముద్దుల్లో మునిగిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకరినొకరు గట్టిగా హత్తుకోవడం, లిప్‌లాక్ ముద్దు పెట్టుకోవడం వంటి దృశ్యాలు సూటిగా కెమెరాలో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలను చూసిన ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.

Read Also: Russia: ఘోర రైలు ప్రమాదం.. ఏడుగురు మృతి

ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి పాడు పనులు పబ్లిక్ ప్లేస్‌లో కాకుండా మీ ఇళ్లల్లో పెట్టుకోండి అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.. మరికొందరు ప్రస్తుతం తల్లితండ్రుల పెంపకం ఇలా తయారైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ఎక్కువగా శ్రద్ధ చూపాలని, పాఠశాలలు విద్యార్థులకు నైతిక విలువలపై అవగాహన కల్పించాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చిన్న వయసులోనే బయటి ప్రపంచ ప్రభావానికి లోనై, ఇలాంటి పనులు చేయడం శారీరకమే కాకుండా మానసికంగా కూడా హానికరం అని పలువురు విమర్శిస్తున్నారు.

Exit mobile version