Site icon NTV Telugu

Viral Video: ఘోర రోడ్డు ప్రమాదం.. లోడ్ లారీ బోల్తా, బొలెరో నుజ్జునుజ్జు..!

Accident

Accident

Viral Video: ఉత్తరప్రదేశ్‌లో ఓ రోడ్డు మలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాంపూర్ జిల్లా గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పహాడీ గేట్ కూడలి సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. గడ్డి లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపు తప్పి పక్కనే వెళ్తున్న బొలెరో వాహనంపై బోల్తా పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. నైనిటాల్ నేషనల్ హైవేపై, స్థానిక పవర్ హౌస్ సమీపంలో బిలాస్పూర్ వైపు వెళ్తున్న గడ్డి లోడ్ లారీ మలుపు వద్ద రోడ్డుపై ఉన్న డివైడర్‌ను ఎక్కింది. అదే సమయంలో పక్కనే వెళ్తున్న బొలెరో వాహనంపై లారీ పూర్తిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్ ఫిరాసత్ (54) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుజర్‌టోలా గ్రామానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు.

RGV : రాజా సాబ్ ఈవెంట్ లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై.. దర్శకుడు వర్మ సెన్సేషనల్ ట్వీట్!

ప్రమాదానికి గురైన బొలెరోపై ‘ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్’ అని రాసి ఉంది. ఈ వాహనం విద్యుత్ శాఖ ఎస్‌డీఓకు సంబంధించినదిగా సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక నిర్ధారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో బొలెరో పక్కన వెళ్తున్న మరో ద్విచక్ర వాహనదారుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కాకపోతే అతని బైక్ ప్రమాదంలో దెబ్బతింది.

ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే రాంపూర్ ఎస్పీ విద్యాసాగర్ మిశ్రాతో పాటు పోలీసులు, ఫైర్ సిబ్బంది, అంబులెన్స్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీ క్రేన్ సాయంతో లారీ కింద నుజ్జునుజ్జైన బొలెరో నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బొలెరోలో ఒక్కరే ఉన్నారని, మరెవరూ లారీ కింద చిక్కుకోలేదని ఎస్పీ స్పష్టం చేశారు.

Bumrah-Hardik: బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు షాక్ ఇవ్వనున్న బీసీసీఐ.. టీ20 ప్రపంచకప్‌పై ఫోకస్..?

ఇదిలా ఉండగా, ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను అధికారులు విడుదల చేశారు. ఫుటేజ్‌లో జంక్షన్ వద్ద బొలెరో మలుపు తీసుకుంటుండగా లోడ్ లారీ డివైడర్ ఎక్కి ఒక్కసారిగా వాహనంపై బోల్తా పడిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బొలెరో పూర్తిగా నుజ్జునుజ్జైన ఈ వీడియో దృశ్యాలు ప్రస్తుతం తీవ్ర విషాదాన్ని కలిగిస్తున్నాయి.

Exit mobile version