Site icon NTV Telugu

Viral Video: అక్కడ కప్ప పకోడీలు చాలా ఫేమస్.. లొట్టలేసుకుంటూ తింటున్న జనాలు!

Frog Pakodas

Frog Pakodas

మనందరికీ ఉల్లిపాయ, మిరపకాయ, బంగాళాదుంప, పన్నీర్, క్యాబేజీ.. పకోడీల గురించి తెలుసు. పకోడీల లిస్టులో ఒక వింతైన పకోడా కూడా ఉంది. మీరు షాక్ అవ్వకండి.. కప్ప పకోడాలు కూడా ఉన్నాయి. థాయిలాండ్, వియత్నాం, చైనా సహా కొన్ని ఆసియా దేశాలలో కప్ప మాంసాన్ని చాలా ఇష్టంగా తింటారు. అక్కడి ప్రజలు కప్పు చాలా రుచికరంగా, అధిక ప్రోటీన్లతో నిండి ఉంటుందని భావిస్తారు. అందుకే కప్పను పకోడా రూపంలో కూడా చేసుకుని తింటారు.

కప్ప పకోడీలు తయారు చేసే పద్ధతి అచ్చు భారతదేశంలో మనం పకోడాలు తయారు చేసే విధంగానే ఉంటుంది. కప్ప పకోడాలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోను speedfoods_channel అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఈ వీడియోలో ఒక మహిళ కప్ప పకోడీలును తయారు చేసింది. ముందుగా కప్పను శుభ్రం చేసింది. పసుపు, ఉప్పు, మిరపకాయ, మసాలా మిశ్రమాన్ని కప్ప కడుపులో నింపింది. కప్ప పైభాగంకు కూడా గట్టిగా మసాలాలు దట్టించచింది. ఆపై వాటిని వేడి నూనెలో వేసి క్రిస్పీగా అయ్యే వరకు వేయించింది. చివరకు వాటిపైన మరోసారి మసాలాలు చల్లి.. వేడి వేడిగా జనాలకు వడ్డించింది. ఈ వీడియోపై నెటిజెన్స్ భిన్న కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Iphone 17 Pre Booking: ఐఫోన్ 17 ప్రీ-బుకింగ్ ప్రారంభం.. ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఎంత చెల్లించాలో తెలుసా?

థాయిలాండ్‌లోని అనేక ప్రాంతాలలో కప్ప సాసేజ్ ఆహారంలో ఒక భాగం. అక్కడి గ్రామాల ప్రజలు కప్పను రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణిస్తారు. కప్ప మాంసంలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. అంతేకాదు త్వరగా జీర్ణం అవుతుంది. ఈ వంటకం క్రమంగా నగరాల్లో కూడా ప్రసిద్ధి చెందడానికి ఇదే కారణం. కప్ప సాసేజ్ ప్రజాదరణకు మరొక కారణం.. వీధి ఆహార సంస్కృతి. థాయిలాండ్‌లో ఖరీదైన రెస్టారెంట్ల కంటే ప్రజలు వీధుల్లో అమ్మే ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే చౌకైగా, రుచితో ఉంటుంది.

Exit mobile version