NTV Telugu Site icon

Iran: కుక్కకు ఆస్తి రాయించి జైలు పాలయ్యాడు

Dog

Dog

ఇరాన్ లో మతాధికారులు కుక్కలు కలిగి ఉండటానికి అనుమతించరు. ఎన్ని నిబంధనలు ఉన్నా కొంత మందికి కుక్కలను పెంచుకోవడం అంటే ఇష్టం ఉంటుంది. పెంపుడు కుక్కలను తమ ఇంటిలో మనుషుల్లాగా చూసుకుంటారు. వాటికి పెద్దగా పార్టీ చేసి పుట్టిన రోజు జరిపిన సంఘటనలు కూడా అనేకం చూశాం. అయితే ఇప్పుడు చెప్పుకోబోయేది వాటన్నింటికంటే భిన్నమయ్యింది. ఇరాన్ లో మతాధికారులు కుక్కలు పెంచుకోవడానికే అనుమతించరు అలాంటిది ఓ దంపతులు తమ కుక్కకు ఆస్తిని రాసిచ్చారు. దానిని ఓ ప్రాపర్టీ ఏజెన్సీ హెడ్ ప్రోత్సహించాడు. సీన్ కట్ చేస్తే ఆ ప్రాపర్టీ ఏజెన్సీ హెడ్ జైలు ఊచలు లెక్కబెట్టాడు. అసలు విషయానికి వస్తే పిల్లలు లేని ఓ జంట తమ మొత్తం ఆస్తిని పెంపుడు కుక్క పేరు మీద రాశాగు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీడియో ప్రకారం ఓ వ్యక్తి ఆస్తికి సంబంధించిన పేపర్లు రెడీ చేసి దంపతుల చేత వాటిపై సంతకాలు తీసుకున్నాడు. అంతేకాకుండా ఆ తరువాత వారి పెంపుడు కుక్క చెస్టర్ కాలి గుర్తులను కూడా ఆ పేపర్ వేయించాడు. తరువాత ఏజెంట్ ట్రాన్స్ ఫర్ అయిన ఆస్తి వివరాల గురించి ఆ దంపతులకు వివరించాడు. దాంతో వారు ఆనందంతో చెస్టర్ ను పట్టుకొని ముద్దాడారు. అంటే ఆస్తి మొత్తం కుక్క పేరు మీదకు వెళ్లిందని అర్థం. ఇక ఆస్తి పొందినట్లు కుక్క కాళ్లతో కూడా సంతకం చేయించారు.

Also Read: Girl Sneeze Challenge: కళ్లు తెరచి తుమ్మిన బాలిక… వీడియో వైరల్

అయితే ఈ ప్రాసెస్ జరిగేటప్పడు తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది కాస్తా ఉన్నతాధికారుల కంటిలో పడింది. ఇంకేముంది ఈ చర్య నైతిక విలువల ఉల్లంఘన కిందకు వస్తుందని,చట్టపరమైన ఆధారం లేకుండా ఆస్తి బదిలీ చేయడం నేరమని పేర్కొంటూ ప్రాపర్టీ ఏజెన్సీ హెడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరాన్ లో కుక్కలను అపరిశుభ్రమైన వాటిగా పరిగణిస్తూ వాటిని పెంచుకోవడం పాపంగా ఫీల్ అవుతారు. ఇక కొన్ని పట్టణాల్లో కుక్కలను బహిరంగ ప్రదేశాల నుంచి కూడా బహిష్కరించారు. ముఖ్యంగా టెహ్రాన్ పట్టణంలో ఈ బహిష్కరణ ఉంది. ఇక కుక్కలకు సంబంధించి ఓ చట్టం తీసుకురావడానికి కూడా ఇరాన్ ప్రభుత్వం ఆలోచిస్తుంది.  కుక్కలను జంతు ప్రదర్శనశాల లేదా ఎడారుల్లో వదిలివేయాలనే చట్టాన్ని తీసుకొచ్చేందుకు ఇరానియన్ ఎంపీలు ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియో కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.