Site icon NTV Telugu

Video viral: వందే భారత్ రైలు కింద చిక్కుకున్న ఆవు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

Vandhi Bharth

Vandhi Bharth

ఇండియాలో వందే భారత్ రైలు పట్టాలపై పరుగులు పెట్టాక ఎన్నో ప్రమాదాలకు గురైంది. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా జరిగిన ఓ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇది కూడా చదవండి: Kareena Kapoor: ఆ పదం వాడినందుకు కరీనా కపూర్ కు షాక్?

అహ్మదాబాద్-ముంబై మధ్య వందే భారత్‌ రైలు దూసుకెళ్తుండగా పట్టాలపైకి ఆవులు వచ్చాయి. దీన్ని గమనించిన లోకో పైలట్.. వెంటనే డ్రైవర్ అత్యవసర బ్రేకులు వేశాడు. అయితే ఆవు మాత్రం వందే భారత్ రైలు కింద చిక్కుకుని విలవిలలాడింది. జంతువును ఎలాగైనా రక్షించాలన్న ఆలోచనతో రైలును వెనక్కి రివర్స్ తీసుకోవడంతో సేఫ్‌గా ఆవు బయటపడింది. గాయాలతో క్షేమంగా ఆవు వెళ్లిపోయింది. కానీ ఆవు నొప్పితో బాధపడుతున్నట్లుగా కనిపించింది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. వైరల్‌గా మారాయి. డ్రైవర్ తీరును నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఇది కూడా చదవండి: Eric Garcetti: చైనా, పాక్‌కి దగ్గరగా ఉండటం వల్లే భారత్ మాకు దూరమైంది: అమెరికా రాయబారి

డ్రైవర్ వీరోచిత నిర్ణయంతో ఆవు ప్రాణాలతో బయటపడింది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు వేగంగా వెళ్లడం వల్ల ప్రమాదాల బారిన పడి అనేక జంతువులు మరణించిన సంఘటనలు గతంలో చాలానే ఉన్నాయి. ఇటీవల జరిగిన ఘటనలో కాన్పూర్ నుంచి ఢిల్లీ వైపు వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని ఆవు మృతి చెందింది. రైలు డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేక్‌లు వేయడంతో చనిపోయిన జంతువు రైలులో ఇరుక్కుపోయింది. రైలు నుంచి జంతువు అవశేషాలను తొలగించడానికి రైలును పది నిమిషాలకు పైగా ఆపివేయవలసి వచ్చింది. ఢిల్లీ-హౌరా మార్గంలో ఈ ఘటన జరగడంతో రైలు అచల్దా స్టేషన్‌లో నిలిచిపోయింది.

Exit mobile version