Site icon NTV Telugu

Viral Video: షాకింగ్ సీన్.. బ్యాటరీనీ కొరికిన బాలుడు.. చివరకు?

Viral Video

Viral Video

Viral Video: మొబైల్ ఫోన్ షాప్‌లో చోటుచేసుకున్న ఓ ప్రమాదకర ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ 12-15 ఏళ్ల మద్యస్తు వయస్సు పిల్లాడు ఓ మొబైల్ బ్యాటరీని నోటిలో పెట్టుకుని కొరికాడు. దానితో అది పేలిపోయి గాయపడిన ఘటన అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Team India: టీమిండియాలోకి హైదరాబాద్ డీఎస్పీ ఎంట్రీ! టీ20 వరల్డ్ కప్‌లో ‘మియా మ్యాజిక్’ ?

వైరల్ గా మారిన వీడియోలో బాలుడు షాప్‌ లోని సర్వీస్ కౌంటర్ వద్ద నిలబడి ఉండగా.. చేతిలో ఉన్న ఓ లిథియం బ్యాటరీని నోటిలో పెట్టుకుని కొరికాడు. దీంతో బ్యాటరీ కవరింగ్ దెబ్బతిని “థర్మల్ రన్ అవే” అనే రసాయన ప్రతిచర్య ప్రారంభమై ఒక్కసారిగా మంటలు పెద్దేత్తున్న వచ్చాయి. దానితో ఆ అబ్బాయి నోట్లో పెట్టుకున్న బ్యాటరీని వెంటనే విసిరివేసాడు. దానితో అది కాస్త ఎదురుగా ఉన్న షాప్ వ్యక్తిపై పడింది.

2026 U19 WC Final: వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్‌.. ఇంగ్లాండ్‌ ముందు ఊహించని టార్గెట్‌!

ఆ వ్యక్తి కూడా వెంటనే అలర్ట్ అయ్యి దానిని కింద పడేశాడు. ఆపై ఆ మంటల్లో ఉన్న బ్యాటరీని తీసుకొని షాప్ నుండి బయటకు విసిరివేశాడు. ఘటనను గమనించిన షాప్ సిబ్బంది, అక్కడ ఉన్నవారు వెంటనే బాలుడికి సహాయం చేసి ఆసుపత్రికి తరలించారు. అతనికి కాలిన గాయాలు అయినట్లు సమాచారం. ఈ ఘటన ఎక్కడ జరిగిందో, బాలుడి వివరాలు ఏమిటో ఇంకా స్పష్టంగా తెలియలేదు.

Exit mobile version