NTV Telugu Site icon

Viral Video : భయంకరమైన యువకుడి బైక్ స్టంట్స్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో..

Viraal

Viraal

సోషల్ మీడియాలో క్రేజ్ కోసం రకరకాల విన్యాసాలను చేస్తుంటారు యువత.. ఇటీవల కాలంలో ఇలాంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి.. ముఖ్యంగా రోడ్లపై యువత చేసే బైక్ విన్యాసాలు.. వీటిపై పోలీసులు ఎంతగా కఠినమైన చర్యలు తీసుకుంటున్నా కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుంటాయి.. తాజాగా మరొక ఘటన వెలుగు చూసింది.. హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి యువత రెచ్చిపోయింది.. భయంకరమైన బైక్ స్టంట్స్ చేసిన వీడియో సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతుంది..

ఇటీవల కొత్తగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్, సెక్రటేరియట్‎తో పాటు పలు ప్రాంతాల్లో బైక్ పై భయంకరమైన విన్యాసాలు చేస్తూ వాటిని వీడియో తీసి సోషల్ మీడియా‏లో పోస్ట్ చేశారు. వీటిని చూసిన ఓ నెటిజన్.. ఇలాంటి ప్రాంతాల్లో బైక్‎లపై విన్యాసాలు చేయడంతో సాధారణ ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని ట్విట్టర్‎లొ పేర్కొన్నాడు. అంతేకాకుండా ఈ వీడియోను హైదరాబాద్ పోలీసులకు, ట్రాఫిక్ పోలీసులకు, రోడ్డు సేఫ్టీ అధికారులకు ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేశాడు.

ఇటువంటి వాటికి పాల్పడిన యువకులపై కఠిన మైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది.. ఈ వీడియో పై తాజాగా పోలీసులు స్పందించారు.. ఆ వీడియో ఆధారంగా యువకుడిని గుర్తించే పనిలో పడ్డారు.. త్వరలోనే ఆ యువకుడిని పట్టుకుంటామని చెబుతున్నారు..