Camel skating: ఎడారిలో జీవించే ఒంటెను “ఎడారి నౌక” (Ship of the Desert) అని పిలుస్తారు. వేడి ఇసుకలో నడవడంలో, పరుగెత్తడంలో దానికి ఎవరూ సాటి రారు. కానీ, ఒక ఒంటె స్కేటింగ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఎప్పుడైనా ఊహించారా? ఇప్పుడు అలాంటి అద్భుత దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దుబాయ్ నగరంలోని వెడల్పైన, విశాలంగా ఉన్న రహదారిపై ఒక ఒంటె స్కేట్‌బోర్డ్‌పై నిలబడి సులభంగా జారుతూ వెళ్తున్న వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. రోడ్డుపై వాహనాలు వెళ్తుండగా, ఒక కారులో ఉన్న వ్యక్తి ఈ అసాధారణ దృశ్యాన్ని కెమెరాలో బంధించాడు. కొన్ని క్షణాల్లోనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.
ఆ వీడియోలో ఒంటె రోడ్డుపై ఎలా స్కేటింగ్ చేస్తుందో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఆ ఒంటె స్కేట్‌బోర్డ్‌పై చాలా వేగంగా జారుతూ వెళ్తోంది. దాన్ని చూసిన నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ వీడియో నిజం కాదు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో సృష్టించబడిన వీడియో అని తేలింది. అయినప్పటికీ, ఒంటె స్కేటింగ్ చేస్తున్నట్లు కనిపించే ఈ క్లిప్ సోషల్ మీడియాలో హల్చల్ సృష్టించింది. కేవలం 11 సెకన్ల నిడివి గల ఈ వీడియోపై వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరు కూడా చూసేయండి ఇక్కడ.
Crime: ఫ్రెండ్ తల్లితోనే ఎఫైర్.. చూసి తట్టుకోలేని కొడుకు ఏం చేశాడంటే..
सब कुछ न कुछ नया कर रहे हैं फेमस होने के लिए 😊
ऊंट बोला में क्यों पीछे रहूं 😂
आप क्या सोचते हैं pic.twitter.com/78rYmHWIfN— Dashrath Dhangar (@DashrathDhange4) October 18, 2025
