NTV Telugu Site icon

Viral Video: అమెరికాలో వెయిటర్ ఉద్యోగాల కోసం నిరుద్యోగుల క్యూ.. భారతీయులు కూడా!

Hotel

Hotel

Viral Video: కెనడాలో నిరుద్యోగం ఎలా ఆధిపత్యం చెలాయిస్తుందో చెప్పడానికి బ్రాంప్టన్ నగరంలోని ఒక రెస్టారెంట్‌లో వెయిటర్ ఉద్యోగాల కోసం గుమిగూడిన నిరుద్యోగుల గుంపు చూస్తే అర్థమవుతుంది. తాజాగా తందూరి ఫ్లేమ్ అనే కొత్త రెస్టారెంట్‌లో ఉద్యోగం కోసం ప్రకటన ఇవ్వబడిందని, దాంతో 3,000 మందికి పైగా ఇంటర్వ్యూలు ఇవ్వడానికి వచ్చారని ఒక భారతీయుడు పంజాబీలో చెప్పాడు. ఇక ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఉద్యోగాల కోసం ప్రజలు క్యూలో నిలబడి ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే అమెరికాలో కూడా తీవ్ర నిరుద్యోగ సమస్య ఉందని అర్థమవుతుంది.

Also Read: Rashmika Mandanna: మరీ అంత క్యూట్ గా చుడొదబ్బా.. కుర్రాళ్లకు హార్ట్ హార్ట్ ఎటాక్ వస్తే ఎలా!

ఇంటర్వ్యూల కోసం ఇక్కడికి వచ్చిన కొంతమంది భారతీయులలో అగంవీర్ సింగ్ అనే యువకుడు తాను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నానని, ఇంటర్వ్యూ కోసం వచ్చినప్పుడు చాలా క్యూ ఉందని చెప్పాడు. ఇప్పటి వరకు 70 చోట్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేశామని, 3 చోట్ల ఇంటర్వ్యూలు ఇచ్చామని చెప్పారు. రెస్టారెంట్ ఉద్యోగాల కోసం వచ్చిన యువతలో ఎక్కువ మంది భారతీయులే కనిపిస్తున్నారని., రెస్టారెంట్లలో ఉద్యోగాల ఖాళీలు తక్కువని తెలిపారు.

Also Read: Road Accident: దారుణం.. ప్రమాదంలో 10 మంది కార్మికులు మృతి!