NTV Telugu Site icon

RGV: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని ప్రశంసిస్తూ.. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ వైరల్

Rgv

Rgv

ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్ భద్రతను పెంచారు. ఇదిలా ఉంటే ప్రముఖ చిత్రనిర్మాత రామ్ గోపాల్ వర్మ, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్టులు చర్చనీయాంశమవుతున్నాయి. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సినిమా ప్రస్తుత నటుల కంటే అందంగా కనిపిస్తాడని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నాడు. లీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను రెచ్చగొట్టే విధంగా రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హెచ్చరికలకు తగినట్లుగా స్పందించాలని, తాను పిరికివాడు కాదని నిరూపించుకోవాలని పేర్కొన్నాడు. “సల్మాన్ ఖాన్ బిష్ణోయ్ కి సూపర్ కౌంటర్ థ్రెట్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. లేదంటే టైగర్ స్టార్ పిరికితనంలా అనిపిస్తుంది. బీతో పోలిస్తే తాను పెద్ద సూపర్ హీరో అని అభిమానులకు నిరూపించాల్సిన అవసరం సల్మాన్ ఖాన్ పై ఉంది” అని రాసుకొచ్చాడు.

READ MORE: Railway: రైలులో ప్రయాణించే రోగులకు రైల్వే ప్రత్యేక రాయితీ.. ఏ రోగులకు ఎంత రాయితీ తెలుసా..?

లారెన్స్ బిష్ణోయ్‌లాగా ఎవరూ లేరు
ఇక మరో ట్వీట్ లో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ లాగా ఏ ఫిల్మ్ స్టార్ లేడు అని కూడా ఆర్జీవీ అన్నాడు. ఈ సందర్భంగా అతనికి సంబంధించిన ఓ ఫొటోను కూడా ఆర్జీవీ పోస్ట్ చేశాడు. “ఓ అతిపెద్ద గ్యాంగ్‌స్టర్ పై ఎవరైనా సినిమా తీయాలని అనుకుంటే.. దావూద్ ఇబ్రహీంలాగానో, చోటా రాజన్ లాగానో ఉండే వ్యక్తిని తీసుకోరు. కానీ ఇతన్ని చూడండి. బీ కంటే బాగా కనిపించే ఏ ఫిల్మ్ స్టార్ ని నేను చూడలేదు” అని పేర్కొన్నాడు. 1998లో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకను వేటాడిన సమయంలో లారెన్స్ బిష్ణోయ్ వయసు కేవలం ఐదేళ్లని, అలాంటి వ్యక్తి 25 ఏళ్లుగా ప్రతీకారం కోసం చూస్తుండటం ఆశ్చర్యంగా ఉందని ఈ మధ్యే రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ చేసిన విషయం విదితమే.

READ MORE:Tollywood: తెలుగు స్టార్ హీరోల సినిమాల లైనప్ ఇదే