NTV Telugu Site icon

Viral News: ఇదేం ఆఫర్ రా బాబూ? ఒక్క వరుడికి ఇద్దరు వధువులా?

Viral Photo

Viral Photo

వివాహం అంటే మాములు తంతు కాదు. అతిథుల నుంచి అప్పగింతల వరకు ఎంతో తతంగం ఉంటుంది. అయితే ఇటీవల కొన్ని పెళ్లిళ్లు పీటల మీదే ఆగిపోతున్నాయి. వధూవరుల్లో కొంతమంది కుటుంబసభ్యులకు షాకులు కూడా ఇస్తున్నారు. దీంతో పెళ్లికి వచ్చిన బంధువులు, అతిథులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కొందరు అయితే పెళ్లి ఆగిపోతే తమ పరువు పోయినంతగా ఫీలయిపోతుంటారు. ఈ నేపథ్యంలో ఓ పెళ్లి సందర్భంగా ఓ కుటుంబం ముందస్తు జాగ్రత్తగా ప్లాన్ Bని ముందే సెట్ చేశారు. ఒకవేళ వధువు షాకిస్తే వరుడి కోసం వేరే వధువును కూడా సిద్ధంగా చేశారు.

సాధారణంగా వివాహం జరిగే సమయంలో వరుడు, వధువులకు సంబంధించిన బ్యానర్, ఫ్లెక్సీలను పెళ్లి జరిగే ఫంక్షన్ హాల్ ముందు ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఓ బ్యానర్‌లో ఇద్దరు వధువుల పేర్లు ఉన్న ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సదరు బ్యానర్‌లో బాలాజీ వెడ్స్ రాజ్యలక్ష్మీ లేదా పవిత్ర అని మెన్షన్ చేశారు. అంటే వరుడు ఇద్దరు అమ్మాయిల్లో ఒకరిని పెళ్లి చేసుకునేందుకు ముందే ఆఫర్ సిద్ధం చేశారు. దీంతో నెటిజన్లు ఇదేం పెళ్లిరా బాబూ.. ఒక్క వరుడికి ఇద్దరు వధువులేంటి అని రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇటీవల చాలా కారణాల వల్ల పీటల మీదే పెళ్లిళ్లు ఆగిపోతున్నాయని వింటున్నామని.. సో ప్లాన్ B ఉండటంలో తప్పేమీ లేదంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.