NTV Telugu Site icon

Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ హింస.. తాజాగా ముగ్గురు మృతి

Manipur

Manipur

మణిపూర్ మ‌ళ్లీ అట్టుడుకుతోంది. కాంగ్‌పోక్పి జిల్లాలో మంగళవారం ఉదయం ముగ్గురు గిరిజనులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. గిరిజనులు అధికంగా ఉండే కంగ్గుయ్ ప్రాంతంలోని ఇరెంగ్, కరమ్ వైఫే గ్రామాల మధ్య ఈ దాడి జరిగిందని కాంగ్ పోక్పి అదనపు పోలీసు సూపరింటెండెంట్ తోలు రాకీ తెలిపారు. మరోవైపు ఈ దాడిని కాంగ్‌పోక్పికి చెందిన కమిటీ ఆఫ్ ట్రైబల్ యూనిటీ (COTU) ఖండించింది. లోయలోని అన్ని జిల్లాలను కేంద్ర ప్రభుత్వం అస్తవ్యస్త ప్రాంతాలుగా ప్రకటించాలని సామాజిక సంస్థ పేర్కొంది.

Pallavi Prashanth: ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంట్రా.. ఓవర్ యాక్షన్..

మరోవైపు ఘటనా స్థలానికి పోలీసులు, అస్సాం రైఫిల్స్ బలగాలు చేరుకున్నాయి. భద్రత బలగాలు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయని పోలీస్ అధికారి తెలిపారు. మృతులను కుకి గొడుగు సమూహమైన ఇండిజెనియస్ ట్రైబల్ లీడర్స్ ఫోరంకు చెందిన వారిగా గుర్తించారు. మృతులు ముగ్గురు కుకి-జో నివాసితులని, సాయుధ దుండగులు సైనిక దుస్తులు ధరించారని గిరిజన ఐక్యత కమిటీ (COTU) ఒక ప్రకటనలో తెలిపింది.

Physical Harassment: ఇంటర్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్..! కాలేజ్ నుంచి వస్తుండగా ఎత్తుకెళ్లి..

ఇదిలా ఉంటే.. మణిపూర్‌లో సాధారణ స్థితిని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేయడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఉంటే.. వెంటనే లోయలోని అన్ని జిల్లాలను చెదిరిన ప్రాంతాలుగా ప్రకటించాలిని, సాయుధ దళాల చట్టం, 1958ని అమలు చేయాలి అని COTU తెలిపింది. అంతుకుముందు సెప్టెంబర్ 8న తెంగ్నౌపాల్ జిల్లాలోని పల్లెల్‌లో జరిగిన హింసకాండలో ముగ్గురు మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు. సెప్టెంబర్ 6న బిష్ణుపూర్ జిల్లాలోని ఫౌగక్చావో ఇఖాయ్ వద్ద బారికేడ్లను బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తున్న నిరసనకారులను చెదరగొట్టడానికి భద్రతా దళాలు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాయి.

Rohit Sharma: అరుదైన ఘనత.. వన్డేల్లో 10 వేల పరుగులు చేసిన ‘హిట్’ మ్యాన్

ఈ ఏడాది మే 3న మణిపూర్‌లో కుల హింస చెలరేగినప్పటి నుంచి ఇప్పటి వరకు 180 మందికి పైగా మరణించగా.. వందలాది మంది గాయపడ్డారు. మెయిటీ కమ్యూనిటీకి షెడ్యూల్డ్ తెగ హోదా కల్పించాలనే డిమాండ్‌కు నిరసనగా కొండ జిల్లాల్లో ‘గిరిజన సంఘీభావ యాత్ర’ నిర్వహించినప్పుడు ఈ హింసకాండ చెలరేగింది.

Show comments