Site icon NTV Telugu

Bolla Brahma Naidu: లోకేష్‌కు దమ్ముంటే వినుకొండలో పోటీ చేసి నాపై గెలవాలి..

Bolla Brahma Naidu

Bolla Brahma Naidu

Bolla Brahma Naidu: టీడీపీ నేత నారా లోకేష్‌కు వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సవాల్ విసిరారు. లోకేష్‌కు దమ్ముంటే వినుకొండలో పోటీ చేసి తనపై గెలవాలంటూ సవాల్ చేశారు. లోకేష్ యువ గళం పాదయాత్ర పేరుతో అబద్ధాలు చెబుతూ తిరుగుతున్నాడని.. యువతను రెచ్చగొట్టి పోలీస్ కేసులలో ఇరికిస్తున్నాడని ఆయన విమర్శించారు. లోకేష్ మంత్రిగా ఉన్న సమయంలో రూ.2400 కోట్లతో వినుకొండను అభివృద్ధి చేశామని చెప్తున్నాడని.. ఆ డబ్బులు ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు.

Also Read: Pawan Kalyan: గుండెకు గొంతు వస్తే.. బాధకు భాష వస్తే.. అది గద్దర్.. గుండెలను పిండేస్తున్న పవన్ కవిత

అందులో లోకేష్ వాటా ఎంతో ప్రజలకు చెప్పాలి.. వినుకొండ ప్రజలకు తాగునీరు ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజలకు తాగునీరు పేరుతో కోట్ల రూపాయలు ట్యాంకర్లకు ఖర్చు పెట్టామని దోచుకున్న లెక్కల వివరాలు చెప్పాలన్నారు. అడ్డదారిలో ముఖ్యమంత్రిగా, మంత్రిగా అవతరించిన చంద్రబాబు, లోకేష్‌లు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆయన ఆరోపించారు.

మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు తన కుటుంబ సభ్యుల బినామీల పేరుతో వినుకొండ ప్రాంతంలో వందల ఎకరాలు ఆక్రమించారని, వినుకొండ సమీపంలో సర్వే నంబరు 251, 253 ,249 నెంబర్లలో ఎన్ఎస్పీ పంటకాల్వను ఆక్రమించి గెస్ట్ హౌస్ నిర్మించారని ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే జీవీ అక్రమాలపై విచారణ చేయిస్తామని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు.

Exit mobile version