Site icon NTV Telugu

Virat Kohli: వింటేజ్ విరాట్ ఈజ్ బ్యాక్.. వరుస సెంచరీలు, గ్రౌండ్‌లో ఆటిట్యూడ్‌తో అదరగొడుతున్నాడుగా..!

Virat Kohli

Virat Kohli

Virat Kohli: వింటేజ్ విరాట్ కోహ్లీ మళ్లీ రంగులోకి వచ్చేశాడని భారత క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు బాదిన కోహ్లీ.. తన కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకున్నాడు. రెండో వన్డేలో చేసిన శతకం ఆయన అంతర్జాతీయ క్రికెట్‌లో 84వ సెంచరీగా నమోదు కాగా.. సచిన్ టెండూల్కర్‌ 100 అంతర్జాతీయ సెంచరీలు అనే మహా రికార్డుకు మరొక అడుగు దగ్గరయ్యాడు. కేవలం బ్యాటింగ్ లో మాత్రమే కాదు.. ఫీల్డింగ్‌లోనూ పాత విరాట్‌ గ్లింప్స్ కనిపించాయి. ఆగ్రహం, ఉత్సాహం, ఆత్మవిశ్వాసంతో కూడిన అతని స్వభావం మళ్లీ కనపడ్తున్నాయి. ఇక గత రాత్రి జరిగిన మ్యాచ్ లో అర్ష్‌దీప్‌ సింగ్ బౌలింగ్‌లో క్వింటన్ డి కాక్ ఔటయ్యాక కోహ్లీ చేసిన చిన్న ‘నాగిన్ డ్యాన్స్‌’ అభిమానులను తెగ అలరిస్తోంది.

KL Rahul: అందువల్లే వల్లే మ్యాచ్ ఓడిపోయాము.. ఓటమిపై కెప్టెన్ ఏమన్నాడంటే..?

రాయ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి భారత్‌ను మొదట బ్యాటింగ్‌కు పంపగా.. కోహ్లీ మరోసారి తన క్లాస్‌ను చాటాడు. 93 బంతుల్లో 102 పరుగులు చేసిన ఆయన.. రుతురాజ్ గైక్వాడ్‌ తో కలిసి మూడో వికెట్‌కు 195 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో రుతురాజ్‌ తన కెరీర్ తొలి వన్డే సెంచరీ నమోదు చేశాడు. సిరీస్ తొలి మ్యాచ్‌లో రాంచీలో 135 పరుగులు చేసిన 37 ఏళ్ల కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో కూడా అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు. ఏడు ఫోర్లు, రెండు సిక్సులతో ఇన్నింగ్స్‌ను అలంకరించిన కోహ్లీ.. నంబర్ 3 స్థానంలో వచ్చి మరోసారి ఆఫ్రికా బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. అన్ని రకాల షాట్లతో ప్రేక్షకులను మైమరిపిస్తూ.. షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో ఆయన సెంచరీ నమోదు చేశాడు.

Mohit Sharma: అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన టీమిండియా ప్లేయర్..!

Exit mobile version