Site icon NTV Telugu

Xora Night Club: జోరా పబ్‌ ఓనర్‌ ని అరెస్ట్ చేసిన పోలీసులు

Hyd Pub

Hyd Pub

వన్య ప్రాణులను తీసుకొచ్చి ప్రదర్శన ఏర్పాటు చేసిన జోరా పబ్‌ ఓనర్‌ వినయ్‌ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మేనేజర్‌ వరహాల నాయుడు, పబ్‌కి వన్యప్రాణులను సరఫరా చేసిన హైదరాబాద్‌ పెట్స్‌ ప్రతినిధులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం ఏడుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇక పబ్‌లోని వన్యప్రాణులను జూకు తరలించారు. కాగా పబ్బును జంతు ప్రదర్శనశాలగా నగరంలోని జోరా పబ్‌ యాజమాన్యం మార్చేసింది. చెట్లు, పుట్టలు లేదా జూలలో ఉండే అరుదైన జంతువులను నేరుగా పబ్‌కే తీసుకొచ్చేశారు.

Also Read : New Payment System: కొత్త పేమెంట్ సిస్టమ్ తీసుకొచ్చేందుకు ఆర్బీఐ ప్లాన్..

పాములు, తొండలు, అడవి పిల్లులు ఇలా చాలా ప్రాణుల్ని తెచ్చి.. పబ్‌ లో ఉంచారు. డీజే సౌండ్స్‌ మధ్య వన్యప్రాణులను బెదరగొట్టారు. పబ్‌లో జంతువులను చూసిన ఓ నెటిజన్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆయన పోలీసులను టాగ్‌ చేస్తూ రీట్వీట్‌ చేశారు. దాంతో జోరా పబ్‌ బాగోతం బయటకు వచ్చింది. పోలీసుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే హైదరాబాద్ అటవీ అధికారులు రంగంలోకి వచ్చి పబ్‌ నిర్వాహకులు వినయ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తమకు అన్ని లైసెన్సులు ఉన్నాయని పబ్‌ నిర్వహకులు అన్నారు.

Also Read : Uorfi Javed : రెజ్లర్ల నిరసనపై స్పందించిన ఉర్పీ జావేద్

జంగిల్‌ థీమ్‌ పేరుతో ఏర్పాటు చేసిన పార్టీలో ఎక్సోటిక్‌ యానిమల్స్‌ను పబ్‌లో నిర్వహకులు ప్రదర్శినకు ఉంచారు. వీటిని పెట్స్‌ దుకాణం నుంచి తెచ్చినట్లు గుర్తించారు. పబ్‌కు వచ్చిన వారిపై ఈ జంతువులు దాడి చేయకుండా వాటికి యాంటి ఇంజెక్షన్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. నెల క్రితం ఓ పబ్‌లో సైతం ఇదే విధంగా జంతువులను ప్రదర్శనకు ఉంచారు. ఆ పబ్‌ ఏర్పాట్లకు మంచి రెస్పాన్స్‌ రావడంతో జోరా పబ్‌ కూడా సీన్‌లోకి దిగింది. జోరా పబ్‌పై తీవ్ర విమర్శలు రావడంతో ఆ పబ్‌ వ్యవహారం కూడా ప్రస్తుతం చర్చల్లోకి వచ్చింది. కాగా మనుషులపై దాడి చేయకుండా పాములు, వన్యప్రాణులకు ఇంజెక్షన్లు ఇస్తున్నారని సమాచారం.

Exit mobile version