NTV Telugu Site icon

Diwali Celebrations: 50 ఏళ్లుగా ఆ గ్రామం దీపావళికి దూరం.. ఎందుకో తెలుసా..?

Diwali

Diwali

దీపావళి వేడుకలను ఘనంగా జరపుకోవడానికి యావత్​ దేశం ఎంతో ఆతృతగా చూస్తున్నారు. కానీ పంజాబ్ బఠిండా జిల్లాలోని మూడు గ్రామాలు మాత్రం పండగకు దూరంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఆర్మీ కంటోన్మెంట్​, మందుగుండు సామాగ్రి డిపో ఉండటంతో దాదాపు 50 ఏళ్లకు పైగా ఈ గ్రామాలు దీపావళి పండగకు దూరంగా ఉండిపోతున్నాయి.

Read Also: UP : నేడు ఉచిత సిలిండర్లను పంపిణీ చేయనున్న యోగి ఆదిత్య నాథ్

పంజాబ్ లోని ఫూస్​ మండి, భగు, గులాబ్​గఢ్ గ్రామాల్లో బాణసంచా పేల్చడం, పంట వ్యర్థాలను కాల్చడంపై నిషేధం పెట్టారు. దీని వల్ల దాదాపు 5 దశాబ్దాలుగా తాము దీపావళి పండగ జరుపుకోలేదని స్థానికులు చెబుతున్నారు. 1976లో పెద్ద ఎత్తున భూమి సేకరించి కంటోన్మెంట్ నిర్మించారని స్థానిక ప్రజలు తెలిపారు. పండగ రోజు తమ పిల్లలు టపాసులు కాల్చి సంతోషంగా గడపడానికి తమ బంధువులు ఇంటికి పంపించాల్సి వస్తోంది అని వెల్లడించారు. నిబంధనలను విరుద్ధంగా ఎవరైన టపాసులను, పంట వ్యర్థాలను కాల్చినా.. జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటుందని స్థానిక ప్రజలు చెప్పుకొచ్చారు.

Read Also: Nandamuri Balakrishna: హిందీ భాషపైన నాకున్న సత్తా ఏంటో చూపించా.. బాలయ్య బాబు వీడియో వైరల్!

ఇక, బాణసంచా, పంట వ్యర్థాలను కాల్చడంపై నిషేధం విధించడంతో పాటు కంటోన్మెంట్​లో గడువు ముగిసిన మందుగుండు పేల్చడం వల్ల తమ గ్రామంలో వాటి శకలాలు పడిన ఘటనలు కూడా ఉన్నాయని ఫూస్​ మండి గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సంఘటనల్లో తమ ఆస్తులకు నష్టం కలిగింది అని స్థానిక ప్రజలు అంటున్నారు. కానీ వాటిపై ఫిర్యాదు చేస్తే అధికారులు చర్యలు తీసుకోలేదని వాపోయారు. దీనికి తోడు కంటోన్మెంట్​ ప్రాంతంలో కొత్త నిర్మాణాలు చేపట్టకుండా నిషేధం ఉందన్నారు. ఆర్మీ కంటోన్మెంట్ ఉండటం, సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల తమ భూముల ధరలు కూడా పెరగలేకపోతున్నాయని ప్రజలు చెబుతున్నారు. ఈ కారణాల వల్ల పండగ సందర్భాల్లో బంధువులు కూడా తమ ఇళ్లకు వచ్చేందుకు ఇష్టం చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల గత 50 సంవత్సరాలుగా దీపావళి పండగ జరుపుకోలేకపోతున్నామన్నారు.