Historical Diwali Stories: దేశవ్యాప్తంగా దీపావళి వెలుగులు వ్యాపిస్తున్న సమయంలో.. ఈ జిల్లాలోని పలు గ్రామాల్లో మాత్రం చీకట్లు అలుముకున్నాయి. వాస్తవానికి అసలు ఈ గ్రామాల్లో దీపాల పండుగను జరుపుకోరు. ఇంతకు దేశవ్యాప్తంగా పండుగ వెలుగులు విరజిమ్ముతున్న వేళ ఎందుకని ఈ గ్రామాల్లో మాత్రం చీకట్లు చుట్టుముట్టాయి. అసలు ఏంటి ఈ గ్రామాలకు మాత్రమే ఉన్న ప్రత్యేకమైన, ఆసక్తికరమైన చరిత్ర.. ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Maoist Party Central Committee: లొంగుబాట్లపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో దీపావళి పండుగ వెలుగులు లేకుండా నిర్మానుష్యంగా ఉన్నాయి. ఈ గ్రామాల్లో పండుగ సందర్భంగా ఎలాంటి రంగోలి వేయరు, దీపాలు వెలిగించరు, వేడుకలు జరుపుకోరు. వాస్తవానికి ఇక్కడి ప్రజలు దీపావళిని జరుపుకోరు, కానీ ఈ పండుగ సందర్భంగా ఇక్కడి ప్రజలు దుఃఖిస్తారు. నిజానికి రాజ్‌గఢ్ ప్రాంతంలోని భావ, అటారి, చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాలలో నివసిస్తున్న చౌహాన్ క్షత్రియ కుటుంబాలు ఈ దీపావళిని జరుపుకోరు.
పండుగ రోజున పృథ్వీరాజ్ చౌహాన్‌ను ముహమ్మద్ ఘోరి హత్య చేశాడని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. వారు పృథ్వీరాజ్ చౌహాన్‌ను తమ పూర్వీకుడిగా, గొప్ప యోధుడిగా భావిస్తారు. అందుకని ఇక్కడి ప్రజలు పండుగ రోజును ఆనందం కంటే ఎక్కువగా లోతైన దుఃఖం, గౌరవంతో జరుపుకుంటారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ పృథ్వీరాజ్ చౌహాన్ జ్ఞాపకార్థం దుఃఖిస్తారు, అందుకే దీపావళి పండుగను జరుపుకోరు. ఈ గ్రామాలలో దీపావళి రాత్రి ఇళ్ళు చీకటిలో ఉంటాయి. కనీసం ఎవరూ కూడా విద్యుత్ దీపాలు లేదా నూనె దీపాలను కూడా వెలిగించరు. కానీ పూజ (ఆరాధన) మాత్రం కచ్చితంగా చేస్తారు. లక్ష్మిదేవి, గణేశుడిని పూజించడానికి ఒక దీపం వెలిగిస్తారు. అయితే ఈ దీపం కూడా తర్వాత ఆరిపోతుంది. అలాగే పండుగ రోజున ప్రతి కుటుంబంలోని సభ్యులు రోజంతా నిశ్శబ్దంగా గడుపుతారు.
శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారం..
ఈ గ్రామాల్లో ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతుంది. ఇక్కడి ప్రజలు రాజు బలిదానాన్ని జరుపుకోరు. అయితే పండుగ తర్వాత నాలుగు నుంచి ఐదు రోజుల తర్వాత వచ్చే ఏకాదశి రోజున వారు దీపావళిని పూర్తి స్థాయిలో జరుపుకుంటారు. ఆ రోజు వారి ఇళ్లలో దీపాలు వెలిగిస్తారు, స్వీట్లు తయారు చేస్తారు, అందరూ కలిసి ఆనందంగా పండుగను నిర్వహించుకుంటారు. ఇక్కడి ప్రజలు దీనినే వారి దీపావళి పండుగా చెబుతున్నారు. ఈ ప్రత్యేకమైన సంప్రదాయం.. వీళ్లను ఇతరుల నుంచి వేరు చేసింది. దేశంలోని మిగిలిన ప్రాంతాలు దీపావళి రోజున దీపాలతో సంబరాలు చేసుకుంటుంటే.. ఇక్కడి ప్రజలు ధైర్యం, త్యాగం చరిత్రను గుర్తు చేసుకుంటారు. ఈ ఆచారం ఒక నివాళి మాత్రమే కాదు, భవిష్యత్ తరాలను వారి చరిత్రతో అనుసంధానించడానికి శక్తివంతమైన సాధనంగా వాళ్లు పేర్కొన్నారు.
READ ALSO: Yama Deepam 2025: రేపు యమ దీపం వెలిగిస్తే ఏం జరుగుతుంది?