దేశ వ్యాప్తంగా టమాటా ధరలు పెరిగి.. గతవారం నుంచి మాములు స్థితికి వచ్చిన సంగతి తెలిసిందే. అయినా కొన్నిచోట్ల టమాటా దొంగతనాలు ఆగడం లేదు. భారీ ధరలు ఉన్నప్పుడు కొన్ని ప్రాంతాలలో టమాటాలు ఎత్తుకెళ్లిన సంఘటనలు మనం విన్నాం, చూశాం. తాజాగా ఇప్పుడు కూడా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్ జిల్లాలో టమాటాలను ఎత్తుకెళ్లిన ఉదంతం తెరపైకి వచ్చింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు టమోటాలతో ఉన్న వాహనంలోని డ్రైవర్‌ను కొట్టి తీసుకెళ్లారు.
Dil Raju: హార్ట్ కింగ్.. చరణ్ ఫ్యాన్స్ హార్ట్ ను విరిచేశాడే
నరగూడ గ్రామ సమీపంలోని నిర్జన ప్రాంతంలో టమోటాలు పెద్దఎత్తున పడి ఉన్నాయని సమీప గ్రామాల ప్రజలకు తెలిసింది. దీంతో వెంటనే సంచులు, కవర్లు పట్టుకుని సంఘటనా స్థలానికి చేరుకుని టమాటాలను ఇంటికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి అప్పటికే టమోటాలన్నీ లూఠీ చేశారు. మరో ట్విస్ట్ ఏంటంటే.. టమాటాలు తరలిస్తున్న వాహనాన్ని ఎత్తుకెళ్లేందుకు డ్రైవర్ ను కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన రెండ్రోజుల క్రితం జరిగింది. మొదటగా వాహనాన్ని ఎత్తుకెళ్లేందుకు.. టమాటాలను రోడ్డు పక్కన పడేశారని ఆ తర్వాత వాహనాన్ని ఎత్తుకెళ్లారని పోలీసులు పేర్కొన్నారు.
Congress letter: కాంగ్రెస్ లో కలకలం రేపుతున్న జనగామ కాంగ్రెస్ విధేయుల లేఖ
ఈ ఘటనపై SP రోహిత్ కష్వానీ మాట్లాడుతూ.. సిద్ధపురా గ్రామ సమీపంలో రోడ్డు పక్కన పడి ఉన్న టమోటాల గురించి సమాచారం అందింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విషయం తెలుసుకోవాలని రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్ చార్జిని ఆదేశించారు. ఆ విషయం తెలుసుకునే పనిలో ముమ్మరంగా చర్యలు చేపట్టారని.. ప్రస్తుతం వాహనం నిండా టమాటాలు ఉండటంతో వాటిని రోడ్డు పక్కన పడేసి ఉంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
