Athidhi Re-release: మహేష్ బాబు ‘అతిథి’ రీ-రిలీజ్.. మణిశర్మ సరికొత్త మ్యాజిక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్‌కు ఊపిరి పోసింది సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అంటే అతిశయోక్తి కాదు. ‘పోకిరి’, ‘బిజినెస్‌మెన్’, ‘మురారి’ వంటి సినిమాలతో థియేటర్లను షేక్ చేసిన అభిమానులు, ఇప్పుడు ‘అతిథి’ రీ-రిలీజ్ కోసం సిద్ధమవుతున్నారు. 2007లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం అందుకోలేకపోయినా, మహేష్ మేకోవర్ మరియు యాక్షన్ సీక్వెన్స్‌లతో అప్పట్లోనే ఒక ట్రెండ్ సెట్ చేసింది.
Also Read : Allu Aravind: మృణాల్ నువ్వు ఇక్కడే పెళ్లి చేసుకోని సెటిల్ అవ్వు..
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
అయితే, ఈ రీ-రిలీజ్ మామూలుగా ఉండబోవట్లేదు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమా కోసం ఒక క్రేజీ ప్లాన్ సిద్ధం చేశారు. ‘అతిథి’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) కోసం ఆయన మళ్ళీ రీ-వర్క్ చేస్తున్నారట. పాత వెర్షన్‌లో ఉన్న స్కోర్‌ను మరింత మెరుగుపరచడమే కాకుండా, కొన్ని కీలక సీన్లకు సరికొత్త మ్యూజిక్ యాడ్ చేస్తున్నట్లు సమాచారం. ఒక పాత సినిమాకు రీ-రిలీజ్ సమయంలో ఇలా మ్యూజిక్ పరంగా కొత్త హంగులు అద్దడం టాలీవుడ్‌లో ఇదే మొదటిసారి కావచ్చు. మహేష్ బాబు స్టైలిష్ లుక్స్, సురేందర్ రెడ్డి టేకింగ్, ఇప్పుడు మణిశర్మ కొత్త బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోడైతే థియేటర్లలో ‘అతిథి’ విధ్వంసం ఖాయమని తెలుస్తోంది. అప్పట్లో మిస్ అయిన సక్సెస్‌ను ఈ రీ-రిలీజ్‌తో బాక్సాఫీస్ వద్ద రికార్డుల రూపంలో అందుకోవాలని ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!