Site icon NTV Telugu

Vikrant Massey: ఇది ముగింపు కాదు, కేవలం విరామం మాత్రమే.. !

Vikrant Massey

Vikrant Massey

సీరియల్స్‌తో కెరీర్ మొదలుపెట్టి, ‘ట్వెల్త్ ఫెయిల్’ వంటి సెన్సేషనల్ హిట్‌తో స్టార్‌డమ్ అందుకున్న విక్రాంత్ మాస్సే, 2024 చివర్లో తన రిటైర్మెంట్ గురించి చేసిన పోస్ట్ అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక నటుడిగా ఎదుగుతున్న సమయంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పడం ఏంటి అని అభిమానులు ఆందోళన చెందారు. అయితే, ఆ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశం అది కాదని ఆయన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని క్లుప్తంగా చెప్పడం వల్లే అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని, తన ప్రయాణం ఇంకా ముగియలేదని ఆయన స్పష్టం చేశారు.

Also Read : D55 :ధనుష్-రాజ్‌కుమార్ పెరియసామి మూవీ షురూ.. ఒకే ఫ్రేమ్‌లో సాయి పల్లవి, శ్రీలీల.. క్రేజీ మల్టీస్టారర్!

విక్రాంత్ మాస్సే మాట్లాడుతూ.. ‘వరుస ప్రాజెక్టులతో నేను తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడికి లోనయ్యాను. రోజుకు 14 నుంచి 16 గంటలు పని చేయడం, ఏడాదికి నాలుగు సినిమాలు పూర్తి చేయడం చాలా కష్టంగా అనిపించింది. నా కుటుంబానికి తగినంత సమయం కేటాయించలేక పోయాననే భావన నన్ను వేధించింది. అందుకే కొన్ని నెలల పాటు నటనకు విరామం ఇచ్చి, నా వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను. అంతే తప్ప శాశ్వతంగా సినిమాలకు దూరమవుతానని నేను ఎక్కడా చెప్పలేదు’ అని వివరించారు. ఈ 7 నెలల విరామం తనకు ఎంతో ఊరటనిచ్చిందని, ఇప్పుడు కొత్త ఉత్సాహంతో మళ్ళీ సినిమాలను అంగీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం విక్రాంత్ చేతిలో కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉండగా, త్వరలోనే ఆయన మళ్లీ వెండితెరపై అలరించనున్నారు.

Exit mobile version