తెలంగాణ రాష్ట్రంలో 20 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, నాన్ కేడర్ ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసిన నేపథ్యంలో సీవీ ఆనంద్ స్థానంలో ఐపీఎస్ అధికారి విక్రమ్ సింగ్ మాన్ హైదరాబాద్ ఇన్‌ఛార్జ్ పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ముగ్గురు పోలీసు కమిషనర్లు, నలుగురు జిల్లా కలెక్టర్లు, పది జిల్లాల ఎస్పీలు, ఒక శాఖ కార్యదర్శి, ఒక శాఖ డైరెక్టర్, ఒక శాఖ కమిషనర్‌ను సీఈసీ బదిలీ చేసింది. ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు ఒక్కో స్థానానికి ముగ్గురి పేర్లను ప్రతిపాదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Also Read : IND vs PAK: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. పోలీసుల గుప్పిట్లోకి అహ్మదాబాద్! 11 వేల మందికి పైగా భద్రతా సిబ్బంది
ఈ బదిలీలపై స్పందించిన డీజీపీ అంజనీకుమార్ ఖాళీల భర్తీకి ఇన్ చార్జి అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ ఇన్‌చార్జి పోలీసు కమిషనర్‌గా విక్రమ్‌సింగ్ మాన్‌తోపాటు, వరంగల్ ఇన్‌ఛార్జ్ పోలీస్ కమిషనర్‌గా డి.మురళీధర్, నిజామాబాద్ ఇన్‌చార్జి పోలీసు కమిషనర్‌గా ఎస్.జయరామ్‌లను నియమించారు. సూర్యాపేట, సంగారెడ్డి, కామారెడ్డి, జగిత్యాల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, గద్వాల్, మహబూబాబాద్, నిర్మల్, భూపాలపల్లిలో ఎస్పీలతో పాటు పలువురు అధికారులను వివిధ స్థానాల్లో నియమించారు.
Also Read : Minister Prashanth Reddy: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మాతృ వియోగం