NTV Telugu Site icon

Vikram : కమల్ ఆఫర్‎ను తిరస్కరించిన విక్రమ్.. ఎందుకంటే ?

New Project (20)

New Project (20)

Vikram : ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా రెండో భాగం ఈ శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే బుకింగ్ ప్రారంభం కావడంతో టిక్కెట్ల విక్రయం జోరుగా సాగుతోంది. ఆదిత కరిగలన్ పాత్రలో నటించిన నటుడు విక్రమ్, ఇటీవల జరిగిన ‘పొన్నియన్ సెల్వన్ 2’ ప్రమోషన్ ఈవెంట్‌లో కమల్ హాసన్ సినిమాలో ఎందుకు నటించలేదో వివరించాడు. ఎంజీఆర్‌ నుంచి కమల్‌హాసన్‌ ‘పొన్నియన్‌ సెల్వన్‌’ హక్కులు పొందారు. ఆ తర్వాత తనకు ఫోన్‌ చేసి ‘పొన్నియన్‌ సెల్వన్‌’ నవలను టీవీ సిరీస్‌గా తీయాలనే ఆలోచనలో ఉన్నానని, అందులో ఎలాంటి పాత్రనైనా ఎంచుకోమని ఆఫర్ ఇచ్చినట్లు విక్రమ్ తెలిపారు.

Read Also: Shahrukh Khan : షారూఖ్‎కు షాక్.. కోర్టు ఏమన్నదంటే

కానీ తనకు టీవీ సీరియల్స్‌లో నటించే ఉద్దేశం లేదని, ‘పొన్నియన్ సెల్వన్’ నవలను సినిమాగా తీస్తే ఎలాంటి క్యారెక్టర్‌లోనైనా నటించేందుకు సిద్ధమని విక్రమ్ తెలిపాడు. అయితే అదే సమయంలో ‘పొన్నియన్ సెల్వన్’ కథలో ఎలాంటి పాత్రనైనా ఎంచుకునే స్వేచ్ఛ తనకు ఇచ్చినందుకు కమల్ హాసన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘పొన్నియన్ సెల్వన్’ మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా విడుదలై రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది. రెండవ భాగం అంతకంటే ఎక్కువ వసూలు చేస్తుందని చిత్ర బృందం అంచనాలు వేస్తున్నారు. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, విక్రమ్ ప్రభు, ప్రభు, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్, పార్థిబన్, ప్రకాష్‌రాజ్, రఘుమాన్, కిషోర్, అశ్విన్, షాడోస్ రవి, రియాస్ ఖాన్, లాల్, మోహన్ రామన్, బాలాజీ శక్తివేల్ తదితరులు ఉన్నారు. పొన్నియిన్ సెల్వన్ 2′కి AR రెహమాన్ సంగీతం అందించారు.

Read Also: Anchor Sreemukhi: పెళ్లికూతురుగా శ్రీముఖి అదుర్స్.. వేదిక ఎక్కడంటే

Show comments