Site icon NTV Telugu

Vijjulatha : తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వీసీగా ప్రొఫెసర్ విజ్జులత

Vijjulatha

Vijjulatha

తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వీసీగా ప్రొఫెసర్‌ విజ్జులత నియమితులయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగానికి చెందిన ఆమె ప్రస్తుతం కోటి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నారు. మహిళా విశ్వవిద్యాలయం తొట్ట తొలి వీసీగా ఆమె పేరు నిలిచిపోనుంది. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిలను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి వీసీగా కోఠి మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎం విజ్జులతను నియమిస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో జారీచేశారు. ప్రొఫెసర్‌ విజ్జులత కోఠి మహిళా కళాశాల పూర్వ విద్యార్థి కావడం విశేషం.

Also Read : Call Girl: కన్ను కొట్టిందని కార్లో ఎక్కించుకున్నాడు.. కాస్త దూరం వెళ్లగానే కంగుతిన్నాడు

1987-90 కాలంలో ఆమె ఇక్కడ బీఎస్సీ (బీజెడ్‌సీ) కోర్సు పూర్తిచేశారు. అధ్యాపక వృత్తిలో చేరి అంచెలంచెలుగా ఎదిగి తాను చదువుకున్న కాలేజీకి ప్రిన్సిపాల్‌గా, ఇప్పుడు వైస్‌ చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు. కాగా, కోఠి ఉమె న్స్‌ కాలేజీని మహిళా వర్సిటీగా ఏర్పాటు చేయడమే కాకుండా, దీనికి ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో తొమ్మిది అంతస్థుల్లో భవన నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

Also Read : Botsa Satyanarayana: ఊరికే చెప్పుకోవడం కాదు, చేసి చూపించాలి.. చంద్రబాబుపై కౌంటర్

Exit mobile version