వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని, ఏ పార్టీలోనూ చేరడం లేదని విజయసాయి రెడ్డి ఎక్స్ లో తెలిపారు. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవు.. పవన్ కల్యాణ్‌తో చిరకాల స్నేహం ఉందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
Vijaysai Reddy: రాజకీయాలకు గుడ్ బై.. కీలక ప్రకటన
- రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి
- రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్న విజయసాయిరెడ్డి
- ఏ పార్టీలోనూ చేరడం లేదన్న విజయసాయిరెడ్డి.