NTV Telugu Site icon

Mahesh Babu-SS Rajamouli: ఆర్‌ఆర్‌ఆర్‌ను మించి మహేశ్‌ బాబు సినిమా ఉంటుంది: విజయేంద్ర ప్రసాద్‌

Untitled Design (2)

Untitled Design (2)

Vijayendra Prasad Gives an Update on Mahesh Babu-SS Rajamouli Film: సూపర్ మహేశ్‌ బాబుతో ఓ సినిమా చేస్తున్నట్టు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి మహేశ్‌-రాజమౌళి కాంబోపై అంచనాలు పెరిగాయి. యాక్షన్‌ అడ్వెంచర్‌ నేపథ్యంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబందించి స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాపై రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మహేశ్‌ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో రానున్న ప్రాజెక్ట్‌ ఒక అడ్వెంచర్‌ మూవీ అని రచయిత విజయేంద్ర ప్రసాద్‌ తెలిపారు. ఈ సినిమాను భారీ స్థాయిలో ప్లాన్‌ చేస్తున్నామని, ఆర్‌ఆర్‌ఆర్‌ను మించి ఈ చిత్రం ఉండనుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్న మహేశ్‌-రాజమౌళి కాంబోపై విజయేంద్ర ప్రసాద్‌ వ్యాఖ్యలు మరింత పెంచాయి. మహేశ్‌ బాబు సినిమా పూర్తైన వెంటనే రాజమౌళి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘మహాభారతం’ మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నామని కూడా ఆయన చెప్పుకొచ్చారు.

మహేశ్‌ బాబు సినిమా కోసం అమెరికాకు చెందిన క్రియేటివ్‌ ఆర్టిస్ట్స్‌ ఏజెన్సీతో డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఒప్పందం చేసుకున్నారు. దాంతో ఈ సినిమాకు హాలీవుడ్‌ టెక్నిషియన్లు పని చేయనున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విజయంతో రాజమౌళి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నారు. దీంతో ఆయన చేయనున్న సినిమాల గురించి తెలుసుకునేందుకు సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు విజయేంద్ర ప్రసాద్‌ వ్యాఖ్యలు విన్న మహేశ్‌ ఫాన్స్ కూడా ఆనందపడిపోతున్నారు.

Also Read: RRR Sequel Update: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సీక్వెల్‌పై అప్‌డేట్‌ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్.. డైరెక్టర్ రాజమౌళి కాదా?

Also Read: MS Dhoni Run-Out: కోట్లాది మంది భారతీయులు హర్ట్.. విలన్ మార్టిన్ గప్టిల్! వీడియో వైరల్

 

Show comments