Mahesh Babu-SS Rajamouli: ఆర్ఆర్ఆర్ను మించి మహేశ్ బాబు సినిమా ఉంటుంది: విజయేంద్ర ప్రసాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayendra Prasad Gives an Update on Mahesh Babu-SS Rajamouli Film: సూపర్ మహేశ్ బాబుతో ఓ సినిమా చేస్తున్నట్టు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి మహేశ్-రాజమౌళి కాంబోపై అంచనాలు పెరిగాయి. యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబందించి స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాపై రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మహేశ్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో రానున్న ప్రాజెక్ట్ ఒక అడ్వెంచర్ మూవీ అని రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ సినిమాను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నామని, ఆర్ఆర్ఆర్ను మించి ఈ చిత్రం ఉండనుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్న మహేశ్-రాజమౌళి కాంబోపై విజయేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు మరింత పెంచాయి. మహేశ్ బాబు సినిమా పూర్తైన వెంటనే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నామని కూడా ఆయన చెప్పుకొచ్చారు.
Also Read
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
మహేశ్ బాబు సినిమా కోసం అమెరికాకు చెందిన క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీతో డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఒప్పందం చేసుకున్నారు. దాంతో ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నిషియన్లు పని చేయనున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ విజయంతో రాజమౌళి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నారు. దీంతో ఆయన చేయనున్న సినిమాల గురించి తెలుసుకునేందుకు సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు విజయేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు విన్న మహేశ్ ఫాన్స్ కూడా ఆనందపడిపోతున్నారు.
Also Read: MS Dhoni Run-Out: కోట్లాది మంది భారతీయులు హర్ట్.. విలన్ మార్టిన్ గప్టిల్! వీడియో వైరల్
తాజావార్తలు
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!