CM Chandrababu : రీల్స్ నుంచి బయటకు రండి.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- వైభవంగా విజయవాడ ఉత్సవ్ 2.0 మెగా కార్నివాల్
- ప్రపంచం గర్వపడేలా ఉత్సవాలను నిర్వహిస్తాం: చంద్రబాబు
- రీల్స్ కాలంలో సంస్కృతి, ఆధ్యాత్మికత అవసరం
- కళలు, సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వ సహకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ వేదికగా జరుగుతున్న సంస్కృతి, సంప్రదాయాల వేడుక ‘విజయవాడ ఉత్సవ్-2.0’ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ ఉత్సవంలో భాగంగా నిర్వహించిన మెగా కార్నివాల్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాచవరం ఎస్ఆర్ఆర్ కాలేజీ నుంచి స్టేడియం వరకు సాగిన ఈ భారీ మెగా కార్నివాల్లో సీఎం చంద్రబాబు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బోండా ఉమ, వెనిగండ్ల రాము, ఎమ్మెల్సీ వర్ల రామయ్యతో పాటు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు.
ప్రపంచం చూసి గర్వపడేలా విజయవాడ ఉత్సవాలు: సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. విజయవాడ ఉత్సవ్‌ను దేశం మొత్తం గుర్తుంచుకునేలా అద్భుతంగా నిర్వహించామని కొనియాడారు. ఇది విజయవాడలో జరుగుతున్న మూడో ఉత్సవమని, రాబోయే రోజుల్లో ప్రపంచమే చూసి గర్వపడేలా ఈ వేడుకలను తీర్చిదిద్దుతామని చెప్పారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రజల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయని, స్థానిక కళాకారులకు తగిన అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. ఒకవైపు ‘విజయవాడ ఉత్సవ్’, మరోవైపు ‘సరస్’ మేళా ఒకే సమయంలో జరగడం విశేషమని పేర్కొన్నారు. ప్రభుత్వాలు కేవలం సంక్షేమం, అభివృద్ధి మాత్రమే కాకుండా మన సంస్కృతి, సంప్రదాయాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు.
Also Read
- Cyclone Alert : బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణం.. ఏపీకి అలర్ట్
- Gopireddy Srinivasa Reddy: వైసీపీ సంచలన నిర్ణయం.. నర్సరావుపేటలో ఎన్నికలు బహిష్కరించిన వైసీపీ
- AP Election Commission: నామినేషన్లపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు.. అభ్యర్థులకు మరో అవకాశం
- AP High Court: నామినేషన్ల గడువు పొడిగించాలి.. హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ఆర్సీపీ..
రీల్స్ కాలంలో ఇలాంటి ఉత్సవాలు ఎంతో అవసరం
నేటి ఆధునిక ఉరుకులు పరుగుల జీవితంలో ప్రజలు సోషల్ మీడియాలో గంటల తరబడి రీల్స్ చూస్తూ గడుపుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నేటి డిజిటల్ యుగంలో టెక్నాలజీ ఎంత ముఖ్యమో, మనశ్శాంతిని ఇచ్చే ఆధ్యాత్మికత కూడా అంతే అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది శ్రీదుర్గమ్మ దర్శనానికి గతంలో కంటే అదనంగా రెండు లక్షల మంది భక్తులు వచ్చారని తెలిపారు. దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతితో పాటు ఇద్దరు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు విజయవాడను సందర్శించారని గుర్తుచేశారు. మన కళలు, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వైభవాలను ప్రపంచానికి చాటిచెప్పాలని పిలుపునిచ్చారు.
భయాలు వీడి పండగ వాతావరణం.. రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణం
గతంలో రాష్ట్రంలో నెలకొన్న భయానక వాతావరణాన్ని గుర్తుచేస్తూ.. నేడు ప్రజలంతా స్వేచ్ఛగా, పండగ వాతావరణంలో వేడుకలు జరుపుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి వారి ప్రయాణాన్ని సులభతరం చేశామని గుర్తుచేశారు. రాష్ట్రంలో కళలను ప్రోత్సహించడానికి, సంప్రదాయాలను పరిరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, ఇలాంటి కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందిస్తుందని సీఎం స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Flying Car: ఇంజినీరింగ్ డిగ్రీ లేదు..13 ఏళ్ల కష్టంతో ‘‘ఫ్లయింగ్ కార్’’ తయారీ..
-
Reliance Jio IPO: కోటి దరఖాస్తులతో జియో సరికొత్త చరిత్ర..
-
CM Revanth Reddy : జూలై నాటికి కరువు తీవ్రం.. నష్టపోవద్దంటూ రైతులకు రేవంత్ హెచ్చరిక
-
OTT Release: సైలెంట్‌గా ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
Cyclone Alert : బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణం.. ఏపీకి అలర్ట్
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!