Vijayawada: కొత్త సంవత్సరం వేడుకలకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు బెజవాడ సిద్ధమైంది. మొన్నటివరకు బ్రాండ్స్ అందుబాటులో లేకపోవడంతో నానా రచ్చ చేసిన మందుబాబులు.. ఇప్పుడు కొత్త బ్రాండ్లు అందుబాటులోకి రావడం ఫుల్ కిక్కే కిక్కు అని అంటున్నారు. మరోవైపు పండుగ సీజన్ మొదలుకావడంతో విజయవాడలోని లిక్కర్ మార్ట్‌లు ఫుల్ స్టాక్‌తో నిండిపోయాయి. గతంలో బ్రాండ్ మద్యం కోసం మందుబాబు ఇతర ప్రాంతాల్లోకి తరలి వెళ్లేవారు. కానీ అన్ని బ్రాండ్లు అందుబాటులోకి రావడంతో పాటు కొత్త మద్యం పాలసీ నేపథ్యంలో ఫుల్ కిక్కు అని మందుబాబులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అందరూ కొత్త సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సారి న్యూఇయర్ వేడుకల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరగనున్నట్లు అంచనాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో లిక్కర్ సేల్స్ పెరగనున్నట్లు సమాచారం.
Read Also: Speaker Ayyanna Patrudu: మరోసారి కుండబద్దలు కొట్టిన స్పీకర్.. అది కుదరని పని..!