Site icon NTV Telugu

CM Jagan Stone Incident Case: సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్

Jagan

Jagan

న్నికల ప్రచారంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాయితో దాడి కేసులో నిందితుడు సతీష్ బెయిల్ పిటిషన్ పై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. నిందితుడు సతీష్ కుమార్ బెయిల్ పిటిషన్స్ పై వాదనలు వినిపించిన న్యాయవాది సలీం.. సతీష్ కుమార్ నిరపరాది, అమాయకుడు అని పోలీసులే ఈ కేసులో అక్రమంగా ఇరికించారన్న న్యాయవాది సలీం వాదించారు. ఇక, మరో వైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావాలనే సీఎం జగన్ పై దాడి చేశారని పేర్కొన్నారు. ఇక, ఇరువురి వాదనల అనంతరం ఆర్డర్స్ ను రిజర్వ్ చేసినట్లు 8వ అదనపు జిల్లా న్యాయస్థానం ప్రకటించింది. ఈ కేసులో రేపు తీర్పును న్యాయమూర్తి ఇవ్వనున్నారు.

Read Also: V. Hanumantha Rao: జూన్ 5 తర్వాత ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది..

కాగా, మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడలోని డాబాకొట్ల సెంటర్ దగ్గర నిర్వహించిన రోడ్ షోలో సీఎం జగన్ పై రాయి దాడి జరిగింది. ఈ దాడిలో సీఎంకు స్వల్పగాయమైంది. ఈ ఘటనలో జగన్‌ మోహన్ రెడ్డి ఎడమ కంటిరెప్పపై భాగంలో గాయమైంది. భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ కావడంతో పాటు వైద్యులు ఆయనకు బస్సులోనే ప్రాథమిక చికిత్స చేసేశారు. ‌దీనిపై అజిత్ సింగ్ నగర్ పోలీసులు స్థానికుడు సతీష్ కుమార్అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.

Exit mobile version