AB Venkateswara Rao: విజయవాడలో ఏబీవీ ప్రచార వాహనాలపై దాడి.. పోస్టర్లు చించివేత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ABV Campaign Vehicles Attacked in Vijayawada: విజయవాడ మేయర్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) ప్రచార వాహనాలపై దాడి ఘటన కలకలం రేపింది. నగరంలోని జక్కంపూడి వైఎస్సార్ కాలనీ సమీపంలో ప్రచారానికి ఉపయోగిస్తున్న ఆటోలకు కట్టిన ఫ్లెక్సీలు, పోస్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. వాహనాలను పార్కింగ్ చేసి డ్రైవర్లు బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. రాత్రి సమయంలో వాహనాలు పార్క్ చేసి ఉండగా దుండగులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆటోడ్రైవర్లు చెబుతున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో దాడికి పాల్పడిన వారిని గుర్తించడం కష్టంగా మారిందని పేర్కొంటున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై ఏబీ వెంకటేశ్వరరావు స్పందిస్తూ.. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం వల్లే ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతున్నానని అన్నారు. ఇతర అభ్యర్థులు అలా ప్రశ్నించే పరిస్థితి లేదన్నారు. ప్రచార సమయంలో డబ్బులు, క్వార్టర్ బాటిళ్లు పంపిణీ చేసినట్లు వార్తలు వస్తున్నాయని.. మద్యం మత్తులో ఆకతాయిలు ఈ పని చేశారా? లేక ఎవరి ప్రోద్బలంతోనైనా చేయించారా? అన్నది తేలాల్సి ఉందన్నారు. తనను మేయర్‌గా గెలిపించకపోతే ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగే అవకాశం ఉందని ఏబీవీ ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read
- Mumbai Indians: ఎంఐలో సంచలన మార్పులు.. బ్యాటింగ్ కోచ్‌గా ఉత్తప్ప.. మలింగ స్థానంలో మిచెల్, కొత్త కోచింగ్ స్టాఫ్ ఇదే..
- Aryan Shukla: ఏఐ కంటే స్పీడ్‌గా లెక్కలేసే భారతీయ కుర్రాడు..16 ఏళ్లకే 9 గిన్నిస్ రికార్డులు, అనేక బంగారు పతకాలు..
- Machavaram Gas Leak: మాచవరంలో మరోసారి గ్యాస్ లీకేజ్ కలకలం.. భయాందోళనకు గురైన స్థానికులు!
- ENG vs SL: వరుసగా 3 ఓటములు.. బెన్ డకెట్ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ ఘన విజయం..!
విజయవాడ అభివృద్ధి గురించి మాట్లాడిన ఏబీవీ.. నగరానికి రావాల్సిన న్యాయమైన నిధుల వాటా కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడతానని తెలిపారు. నగరానికి ఏం చేయబోతున్నారనే అంశంపై ఇతర అభ్యర్థులకు స్పష్టమైన మేనిఫెస్టో కూడా లేదని విమర్శించారు. రాజకీయాల్లోకి రావడానికి ప్రత్యేకమైన రాజకీయ నేపథ్యం అవసరం లేదని వ్యాఖ్యానించారు. మేయర్ ఎన్నికల ప్రచారం జరుగుతున్న వేళ ప్రచార వాహనాలపై దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన వెనుక ఎవరున్నారు?.. ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారా?.. లేదా ఆకతాయిల పనినా? అన్నది పోలీసుల విచారణలో తేలనుంది.
తాజావార్తలు
-
AB Venkateswara Rao: విజయవాడలో ఏబీవీ ప్రచార వాహనాలపై దాడి.. పోస్టర్లు చించివేత!
-
Mumbai Indians: ఎంఐలో సంచలన మార్పులు.. బ్యాటింగ్ కోచ్‌గా ఉత్తప్ప.. మలింగ స్థానంలో మిచెల్, కొత్త కోచింగ్ స్టాఫ్ ఇదే..
-
Pooja Hegde: వరుస ఫ్లాపులతో డీలాపడ్డ పూజా హేగ్డే.. ఇక ఆశలన్నీ ఆ మూడు సినిమాలపైనే!
-
INDIA Bloc Rally: ఢిల్లీలో 20 లక్షల మంది వ్యాపారుల్లో ఆందోళన.. INDIA కూటమి ర్యాలీపై సోనియా గాంధీకి లేఖ
-
Aryan Shukla: ఏఐ కంటే స్పీడ్‌గా లెక్కలేసే భారతీయ కుర్రాడు..16 ఏళ్లకే 9 గిన్నిస్ రికార్డులు, అనేక బంగారు పతకాలు..
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!