మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మునిసిపల్ పరిధిలో దసరా నవరాత్రుల సందర్భంగా దుర్గా మాత ఉత్సవ కమిటీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గా మాత నిమజ్జనం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా సినీనటి, మాజీ ఎం.పి విజయశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గా మాత విగ్రహానానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేదిక మీద విజయ శాంతి మాట్లాడుతూ కె.సి.ఆర్ పాలన పై ద్వజమెత్తారు. కె.సి.ఆర్ పాలనలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని,ఈ అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే అది మీ చేతుల్లో ఉందని ప్రజలకు సూచన చేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని దొచుకొని ఫ్లైట్ కొన్నారని, ఫ్లైట్ కొనడానికి ఆ డబ్బులు ఎక్కడ నుండి వచ్చాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం నిర్వాహకులు గణపతి ప్రతిమను జ్ఞాపక ను అందచేశారు. ఈ కార్యక్రమం లో బి.జె.పి సీనియర్ నాయకులు పట్టోళ్ళ విక్రం రెడ్డి, నందనం దివాకర్,అమరం మోహన రెడ్డి, సముద్రాల కృష్ణ, కౌన్సిలర్లు సర్వస్వతి,హంస రాణి, గుండ్లపొచంపల్లి మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షులు ఉషిగారి శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.