NTV Telugu Site icon

Vijayashanti : 6 నెలల్లో కేసీఆర్‌ని గద్దె దింపాలి.. బీజేపీ ప్రభుత్వం రావాలి

Vijayashanti

Vijayashanti

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరుద్యోగ మార్చ్ ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు విజయశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ ది అంతా దోపిడీ రాబడి అంటూ ఆరోపించారు. కేసీఆర్ నువ్ యూజ్ లెస్..నీ ప్రభుత్వం హోప్ లెస్ అని ఆమె అన్నారు. అంతేకాకుండా.. ‘గతంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి అన్నారు. ఇప్పుడు 60, 70 వేలే అంటున్నారు. కేసీఆర్ ఎగ్జామ్ పేపర్లన్నీ అమ్ముకుంటున్నారు…కేసీఆర్ నీకు సిగ్గుందా. నిరుద్యోగులు ఉసురు పోసుకున్నాడు. ఏడాది కష్ట పడ్డ 30 లక్షల మంది జీవితాల్ని ఆగం చేశావు. కేసీఆర్ కూతురు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోగానే ఏదో ఒకటి లీక్ చేస్తాడు. కేసీఆర్ మనసు క్రూరమైనది.

Also Read : The Kerala Story: కూతుళ్లతో కలిసి “కేరళ స్టోరీ” చూడండి.. తల్లిదండ్రులకు సీఎం పిలుపు

నీ కూతురు లిక్కర్ స్కామ్..నీ కొడుకు పేపర్ లీక్ వీరుడు… నువ్ దేశంలో ప్రతిపక్షాలకు డబ్బులు ఇస్తున్నావ్. నీ దగ్గర ఇన్ని డబ్బులు ఎక్కడివి కేసీఆర్. బండి సంజయ్ ని అక్రమంగా జైలులో పెట్టారు. మునుగోడు లో డబ్బు, మద్యం తో గెలిచారు. ఒకొక్కరికి 5 వేలు, మద్యం పంపిణీ చేశారు. మీరు కూడా ఆలోచించాలి డబ్బులకు అమ్ముడుపోవద్దు. మీరు డబ్బులు తీసుకున్నారు కాబట్టి మీకు కేసీఆర్ పనులు చేయడు. కేసీఆర్ అసలే చేయడు. సచివాలయం ఆయన కోసమే కట్టారట. ప్రతిపక్షాలకు అందులో అనుమతి లేదట. 400 కోట్ల నుంచి 1600 కోట్లకి సచివాలయం వ్యయం పెరిగింది..1200 కోట్లు ఎవరి ఇంట్లో నుంచి తెచ్చి కట్టారు. 6 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. నిర్ణయం మీదే… రాములక్క చెప్పిన నిజాలు ఇవి. 6 నెలల్లో కేసీఆర్ ని గద్దె దింపాలి.. బిజెపి ప్రభుత్వం రావాలి. BRS, కాంగ్రెస్, MIM మూడు పార్టీలు తోడు దొంగలే. ఉమ్మడి మెదక్ లో కాంగ్రెస్, BRS ఎమ్మెల్యేలు బాగా నొక్కుతున్నారు. 5 వేలు ఇచ్చి ఓటు వేయమంటే మూతి పగలగొట్టండి.’ అని ఆమె వ్యాఖ్యానించారు.

Also Read : Harish Shankar: ఏమో అనుకున్నాం కానీ, మాస్టారూ.. మామూలోళ్లు కాదండీ బాబు మీరు

Show comments