Site icon NTV Telugu

Vijayasai Reddy: అబద్ధాల రాజ్యానికి చక్రవర్తి చంద్రబాబు నాయుడు: విజయసాయి రెడ్డి

Vijayasai Reddy

Vijayasai Reddy

Vijayasai Reddy: తాజాగా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సీఎం చంద్రబాబుపై తీవ్రంగా విమర్శలు చేసారు. ఇందులో భాగంగా అబద్ధాల రాజ్యానికి చక్రవర్తి శ్రీ చంద్రబాబు నాయుడు అంటూ తెలిపారు. అలాగే ” ఇక అతని పరివారం ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు..! సిగ్గు విడిచిన వ్యక్తికి తన తప్పు కనపడదన్నది నానుడి. పాలకులకి ఒక న్యాయం పౌరులకు ఇంకొక న్యాయం ఉండదు. చట్టం ముందు అందరు సమానులే. సీఎం చంద్రబాబే పర్యావరణపరంగా సున్నితమైన కృష్ణానది ఒడ్డు పై కట్టిన అక్రమకట్టడంలో నివసిస్తున్నప్పుడు బుడమేరు రివలెట్ పై ఇల్లు పగలగొట్టే నైతిక అధికారం అతనికి ఎక్కడుంటుంది..! అందువల్ల చంద్రబాబు నివసించే అక్రమకట్టడం మొదట కూలగొట్టడం సముచితం. అని ట్విట్టర్ వేదికగా ఆయన రాసుకొచ్చారు.

Balapur Ganesh Laddu: రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. ఎంతంటే..?

ప్రస్తుతం ఈ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. సీఎం చంద్రబాబు నాయుడును విజయసాయి రెడ్డి విమర్శించడంతో చూడాలి మరి ఈ కామెంట్స్ ఎంతవరకు దారి తీస్తాయో.

https://twitter.com/VSReddy_MP/status/1835891498526625873

Exit mobile version