Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన.. మళ్లీ రాజకీయ ప్రవేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayasai Reddy: హైదరాబాద్‌లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించిన నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. ఉదయం నుంచి హైదరాబాద్‌లో పది చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించగా, విజయసాయిరెడ్డి ఇంటితో పాటు పలువురు అనుబంధ వ్యక్తుల ఇళ్లలో కూడా దర్యాప్తు కొనసాగింది. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. లిక్కర్ స్కాం వ్యవహారంలో భారీ స్థాయిలో హవాలా, మనీ లాండరింగ్ జరిగినట్లు ఇప్పటికే ఈడీ గుర్తించినట్లు సమాచారం.
Read Also: Kulfi Recipe at Home: ఇంట్లోనే క్రీమీ స్ట్రీట్-స్టైల్ కుల్ఫీ.. 10 రస్క్‌లతో సూపర్ టేస్ట్ రెసిపీ!
Also Read
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
ఇక, చంద్రబాబు కావాలనే తనను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి.. సోదాల అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి, తనపై రాజకీయ కక్షతో ఈ చర్యలు చేపట్టారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తన ఇంట్లో ఎలాంటి అక్రమాలు బయటపడలేదని, ఏమీ లభ్యం కాలేదని చెప్పారు. ఇంట్లో ఉన్న రూ.6 లక్షలు తమ తల్లి ఆసుపత్రి ఖర్చుల కోసం ఉంచినవేనని స్పష్టం చేశారు.
ఈడీ సోదాలు చేయాల్సింది అక్కడే..
ఈడీ అధికారులు తన ఇంట్లో కాకుండా చంద్రబాబు ఇంట్లో సోదాలు చేయాలని విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అవినీతి వ్యవహారాలపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ, జీవిత చరమాంకంలో అయినా మంచి పనులు చేయాలని సూచించారు. ప్రజలు అన్నింటినీ గుర్తుంచుకుంటారని వ్యాఖ్యానించారు.
జులైలో కొత్త పార్టీ ప్రకటిస్తా
రాజకీయాలకు దూరంగా ఉన్న విజయసాయి రెడ్డి మళ్లీ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని, జులై నెలలో కొత్త పార్టీని ప్రకటిస్తానని వెల్లడించారు. అంతేకాదు.. రాజకీయాలతో పాటు మీడియా రంగంలోకి కూడా ప్రవేశిస్తున్నట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలను ప్రజలకు వెల్లడించేలా మీడియా వేదికను ఉపయోగిస్తానని చెప్పారు. అయితే, విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ప్రకటన, మీడియా రంగ ప్రవేశం, చంద్రబాబుపై చేసిన ఘాటు వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. జులైలో ఆయన ప్రకటించబోయే పార్టీ ఎలా ఉండబోతుంది, ఎవరెవరు చేరతారు అన్నదానిపై ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!+
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!