NTV Telugu Site icon

Vijaysai Reddy: ప్రజలకు ఇచ్చిన 99 శాతం హామీలను జగన్ అమలు చేశారు..

Vijaya Sai

Vijaya Sai

andhra pradesh: గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 99 శాతం హామీలను జగన్ అమలు చేశారు అని నెల్లూరు లోక్ సభ వైసీపీ సమన్వయకర్త విజయ సాయి రెడ్ది తెలిపారు. ఎవరి హయాంలో అభివృద్ధి ఎక్కువ జరిగిందో ప్రజలకు బాగా తెలుసు.. అభివృద్ధిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు సరికావు.. మరోసారి వైసీపీని గెలిపించుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. మరింత మెరుగైన పరిపాలన అందించేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. సిద్ధం సభా వేదికగా సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తారు.. ఇప్పటి వరకూ జరిగిన మూడు సిద్ధం మహా సభలు చరిత్రలో నిలిచిపోయేలా శ్రేణులు హాజరయ్యారు.. జగన్ ఆదేశాల మేరకు నెల్లూరు లోక్ సభ అభ్యర్థిగా బరిలో దిగుతున్నాను.. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారయ్యారు అని విజయసాయి రెడ్డి తెలిపారు.

Read Also: Janhvi kapoor : దేవర నుంచి జాన్వీ క్యూట్ పోస్టర్ రిలీజ్‌..

పుట్టి, పెరిగిన గడ్డపై పోటీ చేసి గెలిచి ప్రజలకు సేవ చేస్తాను అని వైసీపీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటల్లో విశ్వసనీయత లేదు.. ఆ మాటల వెనుక దురుద్దేశం ఉంది.. వేమిరెడ్డి నాకు మంచి మిత్రుడు.. రాజకీయం వేరు, స్నేహం వేరు అని అన్నారు. జిల్లా మీద నాకు పూర్తిగా అవగాహన ఉంది.. రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ జిల్లాను అభివృద్ధి చేశాను.. పార్టీకి, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటాను.. టికెట్ రాలేదని మంత్రి జయరాం టీడీపీలో చేరారు.. రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకునివుంటే బాగుండేది అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.