Janhvi kapoor : దేవర నుంచి జాన్వీ క్యూట్ పోస్టర్ రిలీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ దేవర పార్ట్ 1.. ఈ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.నేడు జాన్వీ కపూర్ బర్త్‌డే సందర్భంగా దేవర టీమ్ జాన్వీ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. దేవర చిత్రం నుంచి జాన్వీకపూర్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.ఈ పోస్టర్‌లో ట్రెడిషనల్ లుక్‌లో జాన్వీకపూర్ కనిపించి ఎంతగానో అలరించింది.. చీరకట్టులో క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటోంది. జాన్వీకపూర్ కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. దేవరలో తంగం అనే పాత్రలో జాన్వీకపూర్ కనిపించబోతుంది.దేవర సినిమాతోనే జాన్వీకపూర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.దేవరలో గ్లామర్‌కు దూరంగా కంప్లీట్‌గా యాక్టింగ్‌కు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో జాన్వీకపూర్ నటిస్తోన్నట్లు సమాచారం.
దేవర సినిమాను దర్శకుడు కొరటాల శివ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.ఫస్ట్ పార్ట్‌ను ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో ఈ చిత్రం రిలీజ్ వాయిదాపడింది. ఇటీవలే ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. దసరా కానుకగా అక్టోబర్ 10న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.దేవర మూవీలో తీర ప్రాంతాల ప్రజలకు అండగా నిలబడే ఓ నాయకుడిగా ఎన్టీఆర్ కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇటీవల షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో సైఫ్ అలీఖాన్ గాయపడ్డాడు. దాంతో షూటింగ్‌ను వాయిదావేశారు. త్వరలోనే ఈ మూవీ కొత్త షెడ్యూల్ పునః ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది.దేవర మూవీకి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దేవర సినిమాకు హీరో కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో దేవర పార్ట్ 1 తెరకెక్కుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?