Site icon NTV Telugu

Vijayasai Reddy: ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన దాడి హేయమైన చర్య

Vijayasai Reddy

Vijayasai Reddy

Vijayasai Reddy: ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన దాడి హేయమైన చర్య అని వైసీపీ లోక్‌సభ అభ్యర్థి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ దాడి వెనుక టీడీపీ నేతలు ఉన్నారని భావిస్తున్నామని.. దీని వెనుక చంద్రబాబు ఉన్నాడని తన అనుమానమని ఆయన అన్నారు. నెల్లూరు సిటీ నియోజక వర్గ పరిధిలోని చిల్డ్రన్స్ పార్క్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ లోక్‌సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఈ మేరకు వ్యాఖ్యానించారు.

Read Also: Balineni Srinivas Reddy: ఇలాంటి ఘటనలకు పాల్పడితే సహించం..

హింస ద్వారా అధికారంలోకి రావాలని చంద్రబాబు అనుకుంటున్నారని.. గతంలో కూడా విశాఖపట్నంలో జగన్‌పై దాడి జరిగిందన్నారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని.. అప్పుడు చిన్న కత్తితో దాడి జరిగినా దానిపై విపరీత అర్థాలను చంద్రబాబు ప్రచారం చేశారన్నారు. అధికారం కోల్పోయిన ఐదు సంవత్సరాలైనా.. అయినా చంద్రబాబు పాఠాలు నేర్చుకోకుండా హింసా ధోరణిలో ప్రవర్తిస్తున్నారన్నారు. ఎన్నికల సంఘం ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరుతున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్ పై దాడి జరగడాన్ని ఖండిస్తున్నామని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. దాడికి పాల్పడిన వారిని పట్టుకుని చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నామన్నారు.

 

Exit mobile version