NTV Telugu Site icon

Vijayasai Reddy : దేశంలో ఒరిజినల్ బీజేపీ ఉండగా.. రాష్ట్రంలో మరో బీజేపీ ఉంది

Vijayasai Reddy

Vijayasai Reddy

ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు నిర్వహించామన్నారు వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ విజయ్ సాయి రెడ్డి. ఇవాళ ఆయన నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. ఆయా నియోజకవర్గాల్లోని సమస్యలను నేతలు.. కార్యకర్తలు ప్రస్తావించారన్నారు. గతంలో ఎన్నడూ లేనంత విధంగా.. ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా పరిష్కరించి నేతలు కార్యకర్తల నుంచి సమస్యలను తెలుసుకున్నామన్నారు విజయసాయిరెడ్డి. బడుగు బలహీన వర్గాలకు ఎలా సేవ చేయాలనే విషయంపై దృష్టి సారించామని, ఈ సమావేశాలు ఎన్నో సత్ఫలితాలనుచ్చాయన్నారు విజయసాయిరెడ్డి.

అంతేకాకుండా..’వచ్చే లోకసభ ఎన్నికలలో నెల్లూరు నుంచి వైసీపీ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారు. కొన్ని అసెంబ్లీ సర్కిల్ సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ అభ్యర్థులను ఎంపిక చేసారు. మిగిలిన వారిని ఎంపిక చేయాల్సి ఉంది. గతంలో అందరూ చంద్రబాబుని ఎంతో నీతిమంతుడని పొగిడేవారు. రాష్ట్రంలో ఏం జరిగినా అన్ని చంద్రబాబు చెప్పారని ప్రచారం చేశారు. ప్రస్తుతం టీడీపీ తన వ్యూహాన్ని మార్చుకోంది. చంద్రబాబు ఎంత చలాగ్గా ఉన్నారని నేతలు చెప్పారు.

 

ఇప్పుడు ఆయన కు ఆరోగ్యం బాగాలేదని.. చర్మ వ్యాధులు వచ్చాయని చెబుతున్నారు. ఈ వ్యూహాలను కొన్ని ఛానళ్లు..మీడియా లు ప్రచారం చేస్తున్నాయి. లోకేష్ కు అమిత్ షా నే అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. దేశంలో ఒరిజినల్ బీజేపీ ఉండగా రాష్ట్రంలో మరో బీజేపీ ఉంది. మాటల ద్వారా గెలవలేనప్పుడు కత్తులు కటార్లు పట్టుకోమని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అందుకే కోర్టులో న్యాయమూర్తుల ముందు న్యాయవాదులను బెదిరిస్తున్నారు. పురందేశ్వరిది ఎల్లో లోటస్. బీజేపీ ఒరిజినల్ లోటస్. చంద్రబాబు అవినీతిపై పురందేశ్వరి భర్త వెంకటేశ్వరరావు గారు పుస్తకం వేశారు. పురంధేశ్వరి మాత్రం చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని అంటున్నారు. పురందేశ్వరి చంద్రబాబు కు ఎంతకు అమ్ముడుపోయారు. బాబు అవినీతిలో మీ వాటా ఎంత.

 

తనకంటే మహానటుడు చంద్రబాబు అని ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం అంటే పురందేశ్వరి ..లోకేష్ లన కలయిక చూస్తే తెలుస్తుంది. చంద్రబాబు అరెస్టులో బీజేపీ పాత్ర ఉందని అన్నారు. కానీ సీఐడీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసింది. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. చంద్రబాబు అవినీతిని పూర్తిగా వెలికి తీస్తాం. దీంతోపాటు అడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధికి పాటుపడతాం. నెల్లూరు జిల్లాలో గతంలో పది స్థానాలకు పది గెలిచాం. కొత్త నెల్లూరు జిల్లా పరిధిలో ప్రస్తుతం ఉన్న 8 స్థానాల్లో కూడా విజయం సాధిస్తాం. ప్రతి నియోజకవర్గంలో కూడా సమస్యలు ఉన్నాయి.. కొన్ని అభిప్రాయ బేధాలు వస్తాయి.

 

ఒకోరి ఆలోచన ఏ విధంగా ఉంటుంది అందర్నీ కలుపుకొని పోయి. కావలి నుంచి వచ్చే ఎన్నికల్లో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారు. చిన్న సమస్యలను ఆయన పరిష్కరిస్తారు. చంద్రబాబు అవినీతి సంబంధించి అన్ని ఆధారాలను సీఐడీ సేకరించింది. ఎవర్ని విచారించాలనే విషయాన్ని ఆ విచారణ సంస్థ చూసుకుంటుంది. సీఐడీ విచారణ సక్రమంగా సాగుతోంది. ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో 99 శాతం నెరవేర్చాం. దాదాపు అన్ని ఇళ్ళకు సంక్షేమ. అభివృద్ధి పథకాలను అందించాం.’ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.