NTV Telugu Site icon

GT vs KKR: విజయ్ శంకర్‌ వీరబాదుడు.. కోల్‌కతాకు భారీ లక్ష్యం

Vijay Shankar

Vijay Shankar

GT vs KKR: ఐపీఎల్ సీజన్‌ 16 లో భాగంగా గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజ‌రాత్ టైటాన్స్‌, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన‌ గుజరాత్ మొద‌ట‌ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ 4 వికెట్లు కోల్పోయి 204 భారీ స్కోరు చేసింది. ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ అజేయంగా 63 పరుగులతో గుజరాత్‌ టైటాన్స్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 24 బంతుల్లోనే 63 పరుగులు చేసి గుజరాత్‌ అభిమానులను ఉర్రూతలూగించాడు. ఇదిలా ఉండగా.. సాయి సుదర్శన్ 38 బంతుల్లో 53 పరుగులు చేసి, ఐపీఎల్ 2023లో తన రెండో వరుస అర్ధ సెంచరీని నమోదు చేశాడు. పవర్‌ప్లేలో వృద్ధిమాన్ సాహాను కూడా అవుట్ చేసిన సునీల్ నరైన్ చేతిలో తన వికెట్ కోల్పోవడానికి ముందు శుభ్‌మన్ గిల్ అద్భుతమైన టచ్‌లో కనిపించాడు. అభినవ్‌ మనోహర్‌ 8 బంతుల్లో 14 పరుగులు చేసి సుయాశ్ శర్మ బౌలింగ్ బౌల్డ్ అయ్యాడు.

ఏదేమైనా సొంత గ్రౌండ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ బ్యాట‌ర్లు చెల‌రేగారు. విజ‌య్ శంక‌ర్(63), సాయి సుద‌ర్శన్(53) హాఫ్ సెంచరీ బాద‌డంతో ఆ జ‌ట్టు భారీ స్కోర్ చేసింది. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ముందు 205 పరుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. శార్ధూల్ ఠాకూర్ వేసిన 20వ ఓవ‌ర్‌లో విజ‌య్ శంక‌ర్ రెచ్చిపోయాడు. సిక్సర్‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న అత‌ను హ్యాట్రిక్ సిక్స్‌లు బాదాడు. 20 ప‌రుగులు రావ‌డంతో గుజ‌రాత్ 204 ర‌న్స్ చేయ‌గ‌లిగింది. కోల్‌క‌తా బౌల‌ర్లలో సునీల్ న‌రైన్ మూడు, సుయాశ్ శ‌ర్మ ఒక‌ వికెట్‌ తీశారు.

స్వల్ప అస్వస్థత కారణంగా ఇవాల్టి మ్యాచ్‌కు గుజరాత్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా దూరం కాగా అతని స్థానంలో రషీద్‌ ఖాన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.హార్ధిక్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన విజయ్‌ శంకర్‌ తన బ్యాట్‌ను ఝులిపించి విజయంపై ఆశలు కల్పించాడు.

Show comments