Site icon NTV Telugu

Kollywood : యు టర్న్ తీసుకున్న స్టార్ హీరో.. ఆ పాత్రలకు గ్రీన్ సిగ్నల్

Vijay Sethupathi

Vijay Sethupathi

కోలీవుడ్‌లో ఒక్కొక్క మెట్టు పేర్చుకుంటూ మక్కల్ సెల్వన్‌గా ఎదిగాడు విజయ్ సేతుపతి. అతడు ఈ స్థాయికి ఎదగడానికి ప్రధానంగా విలన్‌ రోల్స్‌ హెల్ప్‌ అయ్యాయి.. హీరోగా ఎలా ఒదిగిపోతాడో.. విలన్‌గానూ భయపెడుతుంటాడు. సుందర పాండ్యన్‌లో జగన్, మాస్టర్‌లో భవాని, విక్రమ్ వేదలో వేద, విక్రమ్‌లో సంతానం, ఉప్పెనలో శేషా రాయనంగా డిఫరెంట్ షేడ్స్ ఉన్న విలనిజాన్ని పండించాడు. కానీ జవాన్ తర్వాత తన డెసిషన్ మార్చుకున్నాడు మక్కల్ సెల్వన్.

Also Read : AndhraKingTaluka : రామ్ పోతినేని ‘ఆంధ్రకింగ్ తాలుకా’ ఓవర్శీస్ రివ్యూ

జవాన్ హిట్ తర్వాత ఆ ఏడాది ఇఫి వేడుకల్లో పాల్గొన్న విజయ్ సేతుపతి.. నెగిటివ్ రోల్స్ నుండి రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నట్లు ఎనౌన్స్ చేశాడు. విలన్ రోల్స్ చేసేందుకు కొంత మంది అప్రోచ్ అయ్యేటప్పుడు.. తనను ఎమోషనల్ ప్రెజర్ చేస్తున్నారని, కంట్రోల్ చేయాలని చూస్తున్నారని.. ఇలాంటివి ఎదుర్కొవాలనుకోవడం లేదంటూ కొన్నాళ్ల పాటు యాంటోగనిస్టుగా చేయనంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు. కట్ చేస్తే టూ ఇయర్స్‌కే ఈ డెసిషన్ మార్చుకున్నట్టు కనిపిస్తున్నాడు. వెట్రిమారన్- శింబు కాంబోలో తెరకెక్కుతోన్న అరసన్‌లో మక్కల్ సెల్వన్ ఎంట్రీని కన్ఫర్మ్ చేసింది టీం. ఇందులో సేతుపతి నెగిటివ్ రోల్ అనే ప్రచారం జరుగుతోంది. వెట్రిమారన్‌తో స్నేహం కాదనలేక ఈ రోల్ చేసేందుకు ఒప్పుకున్నాడన్నది చెన్నై టాక్. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన విడుదల2 ఫ్లాప్ కావడంతో ఇలా మరో ఛాన్స్ ఇచ్చాడట. అలాగే శింబుతో చెక్క చివంత వనంలో నటించారు విజయ్. ఏడేళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబో రిపీట్‌ కాబోతోంది.

Exit mobile version