Maharaja : చైనాలో 100కోట్ల దిశగా దూసుకెళ్తున్న “మహారాజా”
- చైనాలో విడుదలైన మాహారాజ
- ఏకంగా 40వేల స్క్రీన్లలో రిలీజ్
- తెలుగులోనూ సినిమాకు మంచి ఓపెనింగ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharaja : కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన చిత్రం “మహారాజా”. యువ దర్శకుడు నితిలాన్ స్వామినాథన్ దర్శకత్వం వహించాడు. ఎలాంటి అంచనాలు, పెద్దగా ప్రమోషన్స్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని విడుదలైన అన్నీ చోట్ల మంచి వసూళ్లను సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊహించని విజయం సాధించి రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. కాగా ఈ సినిమాను 20 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు నిర్మాతలు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిత్ర హీరో విజయ్ సేతుపతి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ చిత్రంలో నటించాడట. సినిమా విడుదలయ్యాక లాభాల్లో వాటా తీసుకోమని కోరగా ఆయన అంగీకరించి ఫ్రీగా ఈ చిత్రంలో నటించారని సమాచారం. విడుదల నాటి నుండి సూపర్ హిట్ తో దూసుకు వెళ్లింది ఈ సినిమా. జూన్ 14న విడుదలైన ఈ సినిమా 50 రోజులు విజయవంతంగా ఆడింది. ఇటు తెలుగులోను మహారాజా సూపర్ హిట్ సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో మహారాజా 20కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది.
Read Also:KTR Quash Petition: కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ..
Also Read
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
- Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
- Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
మహారాజ సినిమా విజయ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. ఇపుడు ఈ సినిమా ఇంట్రెస్టింగ్ గా చైనాలో థియేట్రికల్ రిలీజ్ అయింది. అక్కడ నవంబర్ 29న రిలీజ్ అయి మంచి కలెక్షన్లను సాధిస్తోంది. అక్కడ ఏకంగా 40వేల స్క్రీన్స్ లో విడుదల చేయగా ఇపుడు ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. మరి లేటెస్ట్ టాక్ ప్రకారం ఒక్క చైనా మార్కెట్ నుంచే ఇంకో 100 కోట్ల దిశగా వెళుతుంది. లేటెస్ట్ కోలీవుడ్ పి ఆర్ లెక్కల ప్రకారం 91.5 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టు తెలుస్తుంది. దీనితో మహారాజ చిత్రం అక్కడ 100 కోట్ల మార్క్ కి దూసుకెళ్తుంది అని చెప్పాలి. మరి లాంగ్ రన్ లో ఇంకా ఎన్ని కోట్లు సాధిస్తుందో చూడాలి.
Read Also:Selfie Suicide: నాచారంలో యువతి ఆత్మహత్య.. నా చావుకు కారణం వారే అంటూ సెల్ఫీ వీడియో..
తాజావార్తలు
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్నే!
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!