Vijay Sethupati : తమిళ సినిమా పరిశ్రమలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆండ్రియా జెరెమియా. తెలుగులో తడాఖా, సైంధవ్ వంటి సినిమాలతో ఆకట్టుకుంది. హీరోయిన్‌గా మాత్రమే కాకుండా సింగర్‌గా కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న ఈ భామ.. అందరివాడు, బొమ్మరిల్లు, రాఖీ, దేశముదురు, కరెంట్, కింగ్, దడ వంటి చిత్రాల్లో స్వరమందించింది. ప్రస్తుతం ఆండ్రియా తమిళంలో క్యారెక్టర్ రోల్స్‌తో బిజీగా ఉంది. ఇటీవల ఆమె నటించిన తాజా తమిళ చిత్రం మాస్క్లో ఆండ్రియా విలన్‌గా కనిపించనుంది. ఈ సినిమాలో హీరోగా కవిన్ నటిస్తున్నాడు.
Read Also : SSMB29 : సర్ ప్రైజ్.. SSMB29 నుంచి సాంగ్ రిలీజ్
ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి అతిథిగా విచ్చేసిన స్టార్ హీరో విజయ్ సేతుపతి, ఆండ్రియా గ్లామర్‌పై సరదాగా వ్యాఖ్యానించి అందరినీ నవ్వుల్లో ముంచేశాడు. సేతుపతి మాట్లాడుతూ “నా చిన్నతనంలో సముద్ర తీరంలో ఉన్న ఒక విగ్రహం చాలా అందంగా అనిపించేది. నిన్ను చూస్తే కూడా అదే ఫీలింగ్ వస్తుంది. ఎన్నేళ్లు గడిచినా నీ అందం ఏమాత్రం మారలేదే. నువ్వు నటించిన పాత యాడ్‌లో ఉన్నట్టే ఇప్పటికీ అలాగే ఉన్నావు. నేనే కాదు నా కొడుకూ నిన్ను చూసి షాక్ అవుతున్నాడు.. నువ్వు మంచం మీద నిద్రపోతున్నావా… లేక ఫ్రిజ్‌లోనా?” అంటూ తనదైన హాస్యశైలిలో వ్యాఖ్యానించాడు.
Read Also : Akhanda -2 : అఖండ 2 రిలీజ్ డేట్ ఫిక్స్..
