Vijay Government Trust Vote: బలపరీక్షలో నెగ్గిన విజయ్ సర్కార్..!
- విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్షలో విజయం
- విశ్వాస పరీక్షలో ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటు
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా 22 మంది సభ్యులు ఓటు
- సభలో ఉద్రిక్తతల మధ్య 61 మంది ఎమ్మెల్యేలు వాకౌట్
- TVK ప్రభుత్వానికి కాంగ్రెస్, VCK, IUML మద్దతు
- అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు కూడా విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు
- వాయిస్ ఓటింగ్‌కు బదులుగా ఒక్కో ఎమ్మెల్యే పేరు పిలుస్తూ ఓటింగ్ నిర్వహణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Government Trust Vote: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో ఘన విజయం సాధించింది. విశ్వాస పరీక్షలో అవసరమైన మెజార్టీకన్నా ఎక్కువ మద్దతు సాధిస్తూ విజయ్ తన బలాన్ని నిరూపించుకున్నారు. నేడు జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీఎం విజయ్ బలనిరూపణకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ అనంతరం స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. సాధారణ వాయిస్ ఓటింగ్‌కు భిన్నంగా ఒక్కో ఎమ్మెల్యే పేరు పిలుస్తూ వారి ఓటును నమోదు చేయడం ఆసక్తికరంగా మారింది.
ఈ ఓటింగ్‌లో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 22 మంది సభ్యులు ఓటు వేశారు. మరోవైపు సభలో ఉద్రిక్తతల మధ్య 61 మంది ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. తమిళగా వెట్రి కజగం (TVK) ప్రభుత్వానికి కాంగ్రెస్, విదుతలై చిరుతైగల్ కట్చి (VCK), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీలు మద్దతు ప్రకటించాయి. అలాగే ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే) రెబల్ ఎమ్మెల్యేలు కూడా విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేయడం గమనార్హం.
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
మరోవైపు ద్రవిడ మున్నేట్ర కజగం (DMK), అన్నాడీఎంకేలోని ఎడప్పాడి కె. పళనిస్వామి వర్గం, అలాగే పట్టాలి మక్కల్ కచ్చి (PMK) పార్టీలు విజయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలిచాయి. ఈ విజయంతో తమిళనాడులో విజయ్ నాయకత్వానికి మరింత బలం చేకూరినట్లయింది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!